- జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి
ఘట్‌కేసర్: మన ఊరు – మన బడి కార్యక్రమంతో నేడు ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వచ్చిందని జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్ మండలం ప్రతాప్ సింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం విద్యా ఉత్సవాలలో చైర్మన్ పాల్గొని డిజిటల్ తరగతులు, గ్రంథాలయాన్ని స్థానిక సర్పంచ్ వంగూరి శివశంకర్‌తో కలిసి చైర్మన్ ప్రారంభిచారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ఉదయం గ్రామంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.అనంతరం వేదికపై విద్యార్థుల నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అబేదా భేగం, ప్రధానోపాధ్యాయులు రవి కుమార్, వార్డు సభ్యులు మురళీ కృష్ణ, బండిరాల లలిత, నాయకులు రాజేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.