Thursday, December 26, 2024

మన ఊరు మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్ : మన ఊరు మన బడి కార్యక్రమం మొదటి విడతలో జిల్లాలో ఎంపికైన పాఠశాలలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్‌భాజ్‌పాయ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌తో కలిసి విద్యాశాఖ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో మన ఊరు మన బడి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమం మొదటి విడుదల జిల్లాలో ఎంపికైన పాఠశాలలో పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమైనందున పనులను వేగవంతం చేయాలని తెలిపారు.

ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన ప్రహారిగోడ, వంటశాల, మూత్రశాలలు, త్రాగునీటిని త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. పాఠశాలలో అవసరమైన మరమ్మత్తు పనులతో పాటు పెయింటింగ్ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, మిగిలిపోయిన పనులను 15 రోజులలోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీరాజ్ ఈఈ రామ్మోహన్‌రావు, డిఈలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News