Thursday, November 21, 2024

మన ఊరు మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పాఠశాలలో చేపట్టిన అభివృద్ది పనులను మాసంతంలోగా 100 శాతం పూర్తి చేసే విధంగా ఆధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు.

గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందీరంలో జిల్లా విద్యాధికారి అశోక్‌తో కలిసి విద్యాశాఖ ఆధికారులు, మండల పరిషత్ అభివృద్ది ఆధికారులు, ఇంజనీరింగ్ ఆధికారులతో మన ఊరు మన బడి అభివృద్ది పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమం రెండవ విడతలో మంజూరు అయిన పాఠశాలలో అన్ని వసతుల కల్పనకు అధికారులు కృషి చేయాలని అన్నారు. త్రాగునీరు, విద్యుత్ సరఫరా, మూత్రశాలలు, మరుగుదోడ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ప్రహారీగోడ నిర్మాణం పనులు, జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకం కింద చేపట్టవలసిన అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

విద్యాసంవత్సరం తరగతులు ప్రారంభమైనందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించేలా ఆధికారులు దృష్టి సారించాలని తెలిపారు. వంట గదిలో నిర్మాణం పూర్తి చేయాలని, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. మాసంతంలోగా అన్ని పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News