Monday, December 23, 2024

ప్రభుత్వ పాఠశాలలకు వన్నె తెచ్చిన మన ఊరు మన బడి

- Advertisement -
- Advertisement -
  • నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రసమయి

బెజ్జంకి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి సౌకర్యాలతో కార్పొరేట్ విద్య అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దే అని మనకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొనియాడారు. మండల కేంద్రంలోని శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాల ను మన ఊరు మన బడి కార్యక్రమంలో 73 లక్షల 50వేల రూపాయలతో నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మంచి భోజనంతోపాటు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటునట్లు తెలిపారు. ఈ పాఠశాలల భవనం 5 తరగతి గదులు, ప్రతి గదికి ఫ్యాన్స్, విద్యుత్ దీపాలు చేతులు కడుకోవడానికి నల్లాలు,ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధులు,అందరు కలిసి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా తన ఉపాధ్యాయ వృత్తిని గుర్తు చేసుకొని పాఠశాలలో బడిపంతులుగా అవతారం ఎత్తి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలసి మధ్యాహ్నం భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంపిపి నిర్మల , జడ్పిటిసి కవిత, సర్పంచ్ మంజుల,ఎంపిడిఓ ధమ్మని రాము,వ్యవసాయ మార్కెట్ కమిటీ చెర్మన్ చెంద్రకళ, ఎంపిటిసి శారద, పార్టీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు పెంటమీది శ్రీనివాస్, కనగండ్ల రాజేశం, రావుల మొండయ్య, నాయకులు లక్ష్మణ్, ఎలా శేఖర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News