Friday, December 20, 2024

విద్యా వ్యవస్థ బలోపేతానికే మన ఊరు – మన బడి

- Advertisement -
- Advertisement -
  • కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్

కడ్తాల్ : విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్షమని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ అన్నారు. విద్యాభివృద్ధికై ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రికలాంటి మన ఊరుమనబడి కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలోని పాఠశాలలో మౌలిక వసతులు కల్పించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కడ్తాల మండల కేంద్రంలో విద్యా దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులతో కలిసి పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. బాలికల, బాలుర పాఠశాలలో మన ఊరుమన బడి కార్యక్రమంలో భాగంగా రూ. 30 లక్షలతో ఆధునీకరించిన అభివృద్ధి పనులు, మౌలిక వసతులను ప్రారంభించారు. జిల్లా పరిషత్, బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కడ్తాల ప్రభుత్వ పాఠశాలలో తానూ విద్యనభ్యసించి, అదే పాఠశాలలో ఎమ్మెల్యేగా వచ్చి, పనులు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకవచ్చిన సంస్కరణలు కూడా సత్ఫలితాలిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా విధానం, ఇంగ్లీషు మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం, వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు.

అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దేపావత్ కమ్లీ మోత్యనాయక్, జెడ్పిటిసి జర్పుల దశరథ్‌నాయక్, వైస్‌ఎంపీపీ బావండ్లపల్లి ఆనంద్, సర్పంచ్ గూడూరు లక్ష్మీనర్సింహ్మరెడ్డి, సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, ఎంపిటిసి లచ్చిరాంనాయక్, సీఐ జాల ఉపేందర్, ఏంఈఓ సర్ధార్‌నాయక్, ఎంపిడివో రామకృష్ణ, ఉపసర్పంచ్ కడారి రామకృష్ణ, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జంగయ్య, విజయమ్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News