Saturday, November 23, 2024

మన గ్రామాలు దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామాలు దేశానికే ఆదర్శం అని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఖమ్మం రూరల్ మండలంలో పలు గ్రామాల్లో ఆయన విసృ్తతంగా పర్యటించారు. తొలుత తెల్దారుపల్లిలో రూ.20 లక్షలతో సబ్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పొన్నెకల్లు, బారుగూడెం, గొల్లగూడెం గ్రామాలలో ఒక్కో భవనానికి రూ. 20 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనుండగా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక మునుపటి పరిస్థితులు, ఇప్పుడు స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజల కళ్ళ ముందే ఉన్నాయన్నారు. సిఎం కెసిఆర్ ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణగా పరుగులు తీయిస్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పధకాలు, కులాలకతీతంగా చేయుతను ఇస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తున్నారని కొనియాడారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్‌గా నిలవడమే కాకుండా.. ఇక్కడి పథకాలను ఆదర్శంగా తీసుకుని అక్కడి ప్రజలకు ఆయా రాష్ట్రాలు అందిస్తునాయన్నారు.

పల్లె ప్రగతి ద్వారా గ్రామాలలో సమూల మార్పులు చోటు చేసుకుని అభివృద్ధి సోఫానాలుగా విరాజిల్లుతున్నాయన్నారు. పల్లె ప్రకృతివనాలు, క్రిమిటోరియం, చెత్త శుద్ధి కేంద్రాలు, ట్రాక్టర్లు చెత్త బండ్లను పంచాయతీలకు అందజేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ వేతనాలను అందిస్తుండటంతో ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేసి పల్లెలను పరిశుభ్రంగా ఉంచటంలో ప్రధాన భూమికను పోషిస్తున్నారన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటిరెండు కాదని అనేక కార్యక్రమాలు పంచాయతీలలో పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయన్నారు. తప్పకుండా సంక్షేమాన్ని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మరోమారు ప్రజలు ఆశీర్వదించాలన్నారు.

ఈ కార్యక్రమంలో రూరల్ మండలం ఎంపీపీ బెల్లం ఉమా, ఎండవల్లి వర ప్రసాద్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు బెల్లం వేణు, సూడా డైక్టర్ గూడా సంజీవరెడ్డి, వైస్ ఎంపిపి గుడుబోయిన దర్గయ్య, ఎదులాపురం సొసైటీ చైర్మన్ జర్పుల లక్ష్మణ్ నాయక్, మారెమ్మ గుడి చైర్మన్ మట్టా వెంకటేశ్వర్లు, ఆర్‌ఎస్‌ఎస్ కన్వీనర్ ఆపినపల్లి వెంకన్న, ఎంపీడీఓ అశోక్ కుమార్, ఎంపీఓ రాజారావు, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్, వర్క్ ఇన్స్‌పెక్టర్ కుమార్, సర్పంచ్‌లు సిద్ధినేని కోటయ్య, తాటికొండ సుదర్శన్, పల్లెర్ల పాండయ్య, అనురబోయిన లావణ్య, ఉప సర్పంచ్ నరేష్ యాట శిరీష, బండి సతీష్, వెంకటేశ్వరు బీఆర్‌ఎస్ మండల నాయకులు ముత్యం, పెద్ద కృష్ణారావు, ఆంజనేయులు, పదవరపు శ్రీను, లింగయ్య, సోషల్ మీడియా మేకల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News