Tuesday, April 8, 2025

మన చేతుల్లోనే.. మన ఓటు!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓటరు తుది జాబితా ప్రకటించిన తర్వాత అందులో పేరుందో లేదో పరిశీలించుకోవడం మన బాధ్యత. చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. తీరా పోలింగ్ జరిగే రోజు కేంద్రానికి వెళ్లాక అక్కడున్న అధికారులు ‘జాబితాలో మీ పేరు లేదు’ అనగానే ఉసూరుమంటున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం మన చేతిలోనే ఉంది.

ఎక్కడికీ వెళ్లే పనిలేకుండా మొబైల్ ఫోన్‌ల్లో మన ఓటుందో లేదో చూసుకోవచ్చు. గూగుల్‌లోకి వెళ్లి electoralsearch.eci.gov.in వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయ్యాలి. తెరపై బై ఓటర్ ఎపిక్ నంబర్, బై డిటైల్స్, బై మొబైల్ నంబర్ అనే మూడు ఆప్షన్లు వస్తాయి. వాటిల్లో ఒకదాన్ని ఎంచుకొని రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, లాంగ్వేజ్ వివరాలు నమోదు చేస్తే చాలు ఓటరు బాబితాలో మీపేరు ఉందో, లేదో? తెలిసిపోతుంది. పేరుతోపాటు, పోలింగ్ కేంద్రం వివరాలు, పోలింగ్ తేదీ, జాబితాలో సీరియల్ నంబరు ప్రత్యక్షమవుతాయి. ఓటరు ఐడి ఎపిక్ నంబరుతో ప్రయత్నిస్తే ఇది ఇంకా సులభతరం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News