Saturday, December 21, 2024

మహిళలకు భరోసానిచ్చిన సర్కారు మాది

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : తెలంగాణ ప్రభుత్వంలో ఆడపిల్లలకు ప్రాధాన్యత పెరిగిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సమాజంలో ఆడా, మగా తేడా లేదని, అందరూ సమానమని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం మహిళల్లో ధైర్యం , విశ్వాసాన్ని , భరోసాను కల్పించిందని, మహిళా సంక్షేమంలో భాగంగా అనేక పథకాలను అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

ముఖ్యంగా మహిళల సంక్షేమంలో భాగంగా పౌష్టికాహారం , పిల్లలకు బాలామృతం, స్కానింగ్ సెంటర్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్, వివిధ పథకాల కింద పట్టాలను మహిళల పేరు మీద ఇస్తున్నామని, అంగన్‌వాడీ వర్కర్లను టీచర్లుగా మార్చామని, ఆయాలను హెల్పర్లుగా నియమించి వారి గౌరవంతో పాటు, గౌరవ వేతనాన్ని కూడా పెంచామని, మహిళల కోసం షీటీమ్స్, రక్ష ణ చట్టాలను ఏర్పాటు చేయడమే కాకుండా, వాటిని కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం మహబూబ్‌నగర్‌లోని శిల్పారామంలో నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాకముందు మహబూబ్‌నగర్‌లో 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని, నీటి కోసం మహిళల పడ్డ కష్టాలు మరువలేని అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు రూ. 200 పెన్షన్ వస్తే ఇప్పు డు రూ. 2వేలు ఇస్తున్నామని, అలాగే వికలాంగులకు ఇస్తున్న రూ. 3వేలను రూ. 4016 కు పెంచామని, వితంతులు , బీడీ కార్మికులు, వంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్నామని , దేశంలో ఎవరు ఇంత మొత్తంలో పెన్షన్లు ఇచ్చినవారు లేరని, ఇది ఇం డియాలోనే మొట్టమొదటిసారి ఇంత మొత్తంలో పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు.

సమాజంలో 99 శాతం ఆడపిల్లలే తల్లిదండ్రులను బతికించుకుంటున్నారని, ఆడపిల్ల దైవంతో సమానమని ఆయన అ న్నారు. తల్లి బిడ్డను కనేందుకు ఎన్ని కష్టాలు పడి ందో తర్వాత కూడా అన్ని కష్టాలు పడుతుందని అ లాంటి తల్లుల కోసం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింద ని ఆయన తెలిపారు.

జిల్లా కలెక్టర్ జి. రవి నా యక్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్‌గౌడ్ , మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, వైస్ చైర్మన్ గణేష్, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మధుసూదన్‌గౌడ్, ఎల్‌డిఎం భాస్క ర్ , జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర, సిపిఓ దశరథం , మ త్సశాఖ ఏడి రాధా రోహిణి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, సిడిపిఓ శైలశ్రీ, కౌన్సిలర్లు, ఆ సుపత్రి అభివృద్ది కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News