Wednesday, January 22, 2025

మాది అగ్రికల్చర్

- Advertisement -
- Advertisement -

రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలన్నదే నా స్వప్నం

మన తెలంగాణ/హైదరాబాద్ :  ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాల్లో హాజరుకావడానికి స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు తేవాలనే లక్ష్యంగా పర్యటన చేస్తున్నా రు. ఈ సమావేశాల్లో భాగంగా ఆయన దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో భాగంగా ‘ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్’ అంశంపై జరిగిన సిఇటి కాన్ఫరెన్స్‌లో ప్రసంగించా రు. తనను తాను రైతుబిడ్డగా పరిచయం చేసుకున్న సిఎం రే వంత్ రెడ్డి రైతులు, వ్యవసాయం గురించి మాట్లాడారు. తమ కల్చర్.. అగ్రికల్చర్ అని తెలిపారు. తమ దేశంలో వ్యవసా యం లాభసాటిగా లేదన్నారు. రైతులు ఎంతో శ్రమిస్తారని, కానీ, వారు పెట్టిన పెట్టుబడికి, పడిన కష్టానికి తగిన లాభాలు రావని వివరించారు. వారు ఆధునిక సాంకేతికతకు ఆమడ దూరంలో ఉన్నారని తెలిపారు. ‘దావోస్‌లోని లీడర్లందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచానికి సహాయం చేసే రైతులకు ప్రపంచం కూడా సహాయం చేయాలి’ అని అన్నారు. రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడారు. తమ దేశంలోని వ్యవసాయ రంగంలో అతిపెద్ద సమస్య రైతుల ఆత్మహత్యలు అని వివరించారు. ఇతర రంగాల్లో, వ్యాపారల్లో పెట్టుబడులు పెడితే లాభాలు వచ్చినట్టే వ్యవసాయంలోనూ రైతులకు పెట్టుబడులకు తగిన లాభాలు రావాలనేది తమ కల అని వివరించారు. రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో కాం గ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. రైతులు పండించిన పంటకు కనీస మ ద్దతు ధర కల్పిస్తున్నామని వివరించారు.
కొనసాగుతున్న పెట్టుబడుల వరద
రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగుతున్నది. తాజాగా గురువారం బ్రిటన్‌కు చెందిన సర్జికల్ ఇన్‌స్ట్ మెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ (ఎస్‌ఐజీహెచ్) రూ.231 కోట్లతో వైద్య పరికరాల తయారీ పరిశ్రమను పెట్టడానికి ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో ఎస్‌ఐజీహెచ్ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎస్‌ఐజీహెచ్ ఎండీ గౌరి శ్రీధర్, డైరెక్టర్ అమర్ చర్చల అనంతరం ఒప్పందం జరిగింది. ఎస్‌ఐజీహెచ్ సంస్థ మొదటి దశలో సర్జికల్, ఆర్థోపెడిక్, చర్మ, నేత్ర ఆఫ్తమాలిక్ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. రెండో దశలో రోబొటిక్ వైద్య పరికరాలను ఉత్పత్తి చేయనుంది. రానున్న రెండు, మూడేళ్లలో పరిశ్రమ పూర్తిస్థాయిలో ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమ లండన్‌లో నేషనల్ హెల్త్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆస్పత్రిలకు, ప్రైవేట్ వైద్యశాలలకు తమ పరికరాలను సరఫరా చేస్తోంది.
టాటా గ్రూప్ రూ.1500 కోట్ల పెట్టుబడులు..
రాష్ట్రంలోని 50 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపు ణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు టా టా గ్రూప్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. వీటిలో కొత్త కోర్సులు, మాస్టర్ ట్రైనర్ల నియామకానికి రూ.1500 కోట్ల పెట్టబడులు పెట్టనుంది. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ సిఎం రేవంత్ రెడ్డితో సమావేశమ య్యారు. ఇప్పటికే వివిధ రంగాల్లో విస్తరించిన టాటా గ్రూప్ తెలంగాణలో చేపట్టబోయే భవిష్యత్తు వ్యాపార ప్రణాళికలపై చర్చించారు. ఐటీ రంగంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ హైదరాబాద్ లోని అతి పెద్ద ఐటీ కంపెనీలలో ఒకటి . ఇందులో 80 వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. రాబోయే కొన్నేళ్లలో టిసిఎస్ మరింత వృద్ధి చెందనుంది. టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఇప్పటికే గ్లోబల్ డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో పలు ప్రాజెక్టులు చేపట్టింది. బోయింగ్, సికోర్స్ కీ, జిఇ, లాక్‌హీడ్ మార్టిన్ వంటి కంపెనీలతో కలిసి పెట్టుబడులు పెట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టు చేపడుతోంది. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్నితగ్గించే బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తుంది. కొత్త కోర్సులకు పెట్టుబడులు పెడుతుంది. టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా విస్తరణలో నూ హైదరాబాద్ ను ట్రాన్సిట్ హబ్ గా ఎంచుకోనుంది. హైదరాబాద్ నుంచి డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాల కనెక్టివిటీని పెంచనుంది. తెలంగాణ అభివృద్ధికి టాటా గ్రూప్ కీలకమైన భాగస్వామ్యం అందిస్తోందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. వివిధ రంగాలలో పెట్టబడులు పె డుతున్న టాటా గ్రూప్ నకు తగిన సహకారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ ఐటీఐలలో అధునాతన నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు టిటిఎల్ భాగస్వామ్యం పంచు కోవటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పేందుకు చొరవ చూపాలని సిఎం టాటా గ్రూప్ ను స్వాగతించారు. తమ గ్రూప్ పెట్టుబడులకు తెలంగాణ వ్యూహత్మకమైన కేంద్రంగా ఉందని, వీలైనంత మేరకు రాష్ట్రంలో తమ గ్రూప్ వ్యాపారాలను రాష్ట్రంలో విస్తరిస్తామని టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ అన్నారు. కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేయాలనే ఆసక్తితో ఎదురు చూస్తున్నామన్నారు.
హైదరాబాద్‌లో పెట్టుబడులకు ‘క్యూ’..
ఐటీ డెవెలప్ మెంట్, సర్వీసెస్ అందించే క్యూ సెంట్రి యో కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కం పెనీ ప్రతినిధి ఎలమర్తి సమావేశమయ్యారు. ఆయిల్ అం డ్ గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, ఆటోమోటివ్, అగ్రికల్చర్ మరియు ఇంజినీరిం గ్ వంటి రంగాలలో అత్యాధునిక ఐటి సేవలు అందించటంతో ఈ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అమెరికా, ఆసియా పసిఫిక్ రీజియన్లో ఇప్పటికే కార్యకలాపాలను విస్తరించింది. అర్టిఫియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ప్రా సెస్ అటోమేషన్, మెషిన్ లర్నింగ్, బ్లాక్ చైన్ సొల్యూష న్ వరకు వివిధ అధునాతన సాంకేతిక సేవలను ఈ సం స్థ అందిస్తోంది. కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ పరిధిలో దాదాపు 1000 ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా ఎంచుకుంది. వ్యాపార అవకాశాలు, పర్యావరణ అనుకూలతలున్నందున హైదరాబాద్ లో పెట్టుబడు లు పెట్టేందుకు ఈ సంస్థ ఆసక్తిని ప్రదర్శించింది. తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరిం ది. ఐటి రంగంలో మూడు దశాబ్దాలుగా తమ కంపెనీ ఎ న్నో విజయాలు సాధించిందని క్యూ సెంట్రియో సార థ్యం వహించిన యలమర్తి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి, శ్రేయస్సులో తమ కంపెనీ భాగస్వామ్యం పంచుకుంటుందన్నారు.
తెలంగాణలో 09 సొల్యూషన్స్ ప్రత్యేక సప్లై చైన్ స్కిల్స్ అకాడమీ
09 సొల్యూషన్స్ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ప్రత్యేక సప్లై చైన్ స్కిల్ అకాడమీని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది ప్రత్యేక సప్లై చైన్ స్కిల్స్ అకాడమీలో రాష్ట్రం నుండి అధిక సంభావ్య గ్రాడ్యుయేటింగ్ ఇంజనీర్లను సన్నద్ధం చేయడం దీని లక్ష్యం. ఈ సిబ్బందికి గ్లో బల్ కంపెనీల నుండి వివిధ తయారీ, రిటైల్ పరిశ్రమ వర్టికల్స్‌లో చాలా డిమాండ్ ఉంది. తెలంగాణలో కొత్త పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలకు టాటా గ్రూప్ హామీ ఇచ్చింది సప్లయ్ చైన్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్‌లను ప్రారంభించ డానికి ఈ కంపెనీలు ఏర్పాటు చేస్తున్న వి విధ ఎక్సలెన్స్ సెంటర్‌లకు సహకరించడానికి గ్రాడ్యుయేట్‌లకు సహాయం చేసే స్పాన్ ఇండస్ట్రీ డొమైన్ నాలెడ్జ్, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్, ఎఐ, ఇతర సాంకేతిక నైపుణ్యాలను అందించే శిక్షణ ఇవ్వబడుతుంది. అకాడమీని ఫిజికల్, వర్చువల్ మోడల్స్‌లో నడిపేందుకు విజ్ఞానం, పరిశ్రమ డొమైన్ నిపుణులను అందించడం ద్వారా 09 తన ప్రయత్నానికి మద్దతు ఇస్తుంది. రాష్ట్రంలోని విద్యాసంస్థలు, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను యాక్సెస్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఈ మేర కు, స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం 2024 సందర్భంగా 09 సొల్యూషన్స్ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ చక్రి గొట్టెముక్కలతో పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు సమావేశ మ య్యారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రానికి వివిధ రంగాలలో నైపుణ్యం ప్రధానమైనదని, తెలంగాణను తయారీ మరియు ఎగుమతులకు కేంద్రంగా మా ర్చడానికి సరఫరా గొలుసు రంగంలో నిపుణులను సృ ష్టించడం చాలా ముఖ్య మైనది. ఈ ముఖ్యమైన నైపుణ్యం చొరవలో రాష్ట్రానికి మద్దతు ఇచ్చినందుకు నేను o9 సొల్యూషన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. చక్రి గొట్టెముక ్కల తెలంగాణకు ఈ సహాయాన్ని అందించడం తమకు సంతోషంగా ఉందని, ఎందుకంటే రాష్ట్రానికి వచ్చే కొత్త పెట్టుబడుల సరఫరా గొలుసు ప్రక్రియలలో యువతకు గణనీయమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
హైదరాబాద్‌లో ఉబర్ షటిల్, ఉబర్ గ్రీన్
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఉబర్ కంపెనీ హైదరాబాద్ లో తమ సేవలను విస్తరించనుంది. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సిఎం రేవంత్ రెడ్డితో ఉబర్ ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. ఉబర్ కంపెనీ అమెరికా తర్వాత అతి పెద్ద టెక్ సెంటర్ ను హైదరాబాద్‌లోనే నిర్వహిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ద్వారా తమ మొబిలిటీ కార్యకలాపాలను మరిం త విస్తరించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో సుమారు 1000 మంది ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుంది. హైదరాబాద్‌లో రెండు వినూత్న సేవలను పరిచయం చేయాలని ఈ కంపెనీ నిర్ణయించింది. ఉబర్ గ్రీన్ పేరు తో జీరో-ఎమిషన్ ఎలక్ట్రిక్ వెహికల్ రైడ్‌లకు ప్రత్యేక యా క్సెస్‌ను అందిస్తుంది. ఎక్కువ కెపాసిటీ ఉన్న వాహనాలపై ప్రీమియం, సమర్థమైన రైడ్‌లను అందించడానికి ఉబర్ షటిలో సర్వీస్ ను ప్రవేశపెట్టనుంది. తెలంగాణలో పర్యావరణ సంరక్షణ బాధ్యతగా తమ కంపెనీ కట్టుబడి ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఉబెర్ విస్తరణ, హైదరాబాద్‌లో కంపెనీ కొత్త సేవలతో రాష్ట్రంలో మొబిలిటీ, ఆటోమోటివ్ రంగం వృద్ధి చెందనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News