Friday, November 15, 2024

మనది పేదల ఎజెండా, రైతుల ఎజెండా

- Advertisement -
- Advertisement -

రౌతేందో రత్నమేందో ఆలోచించాలే : కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : మనది పేదల ఎజెండా, రైతుల ఎజెండా అని సిఎం కెసిఆర్ అన్నారు. రౌతేందో రత్నమేందో ఆలోచించాలే అని ప్రజలకు సభలో సూచించారు. ‘2018లో శాసనసభ ఎన్నికల మొదటి సభలో నేనను ఇక్కడికే వచ్చి ప్రసంగించడం జరిగింది. హుస్నాబాద్ గడ్డ ప్రజల ఆశీర్వాదంతో ఆనాడు మూడొంతుల మెజారిటీతో 88 సీట్లతో అఖండ విజయాన్ని సాధించినం. ఈ సారి కూడా పెద్దలందరూ చెప్పినారు. మళ్లీ మీరు హుస్నాబాద్ నుంచి జైత్రయాత్ర ప్రారంభించాలనే అన్నారు. అభ్యర్థులందరికీ బీఫారలు అందజేసి మన మేనిఫెస్టో ప్రకటించి నేను ఇక్కడికి మీ దర్శనానికి రావడం జరిగింది.

నేను మీ అందరినీ ఒక్కటే మాట కోరుతున్నా.. నేను చెప్పే నాలుగు మాటలు వినాలి. నేను చెప్పె మాటలు విని విడిచిపెట్టి పోవద్దు. మీ బస్తీకో, మీ గ్రామానికో, తండాకో పోయిన తర్వాత కెసిఆర్ నాలుగు మాటలు చెప్పిండు అందులో నిజమేంది? అవునిజమేందని ఆలోచించాలే. ఎన్నికలు చాలా వస్తయి. చాలా పోతయి. ఎవరో ఒకరు గెలుస్తా ఉంటరు. ఎలక్షను రాంగనే మనం ఆగమాగం కావద్దు. రౌతేందో రత్నమేందో ఆలోచించాలే. మనకు పనికిచ్చేదేదో గుర్తుపట్టాలే. ఎవరో చెప్పిండ్రని అలవోకగా ఓటువేయవద్దు. ఓటు అనేది మన తలరాతను మార్చుతది, తాలూకా రాతను మార్చుతది, జిల్లా రాతను మార్చుతది. మన భవిష్యత్తును మార్చుతది. చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన బావమరిది చెప్పిండో చుట్టం చెప్పిండో, మన మేనమామ చెప్పిండో అనే పద్ధతిలో ఓట్లు వేయకూడదు. కచ్చితంగా ఆలోచించి స్పష్టమైన విధానంతోటి, స్పష్టమైన అవగాహనతోని ఓటింగ్ జరిగినప్పుడు తప్పకుండా ప్రజలు గెలుస్తారు. ప్రజల కోరికలు నెరవేరుతయి’ అని సిఎం కెసిఆర్ ప్రజలకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News