Sunday, November 24, 2024

మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో బ్లాక్‌ఫంగస్ వ్యాప్తి

- Advertisement -
- Advertisement -

Outbreaks of black fungus in Maharashtra and Gujarat

ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు
కంటి చూపు కోల్పోతున్న కొవిడ్ బాధితులు

అహ్మదాబాద్ /ముంబై : మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి మరో ప్రమాదం ఎదురౌతోంది. బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్‌మైకోసిస్ ) సంక్రమించి కంటిచూపు పూర్తిగా పోతోంది. ఈ ఇన్‌ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని వైద్యాధికారులు తెలిపారు. దీన్ని నయం చేయడానికి ఖర్చు కూడా ఎక్కువగా భరించ వలసి వస్తోంది. మూడు వారాల క్రితం కరోనా నుంచి కోలుకున్న ఒక వ్యక్తిలో ఈ బ్లాక్ ఫంగస్ సంక్రమించడాన్ని గుర్తించామని, ఇప్పుడు మా ఆస్పత్రిలో ఈ కేసుల సంఖ్య 50 కి పెరిగిందని మరో 60 మంది చికిత్స కోసం ఎదురు చూస్తున్నారని సూరత్‌కు చెందిన ఒక ఆస్పత్రి అధిపతి మాధుర్ సహానీ చెప్పారు.

సూరత్, గుజరాత్‌ల్లోని ఇతర ప్రాంతాల నుంచి కూడా బాధితులు ఈ ఆస్పత్రికి తరలి వస్తున్నారు. ఈ కేసుల కోసం సూరత్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటైంది. మహారాష్ట్రలో ఈ ఫంగస్ వల్ల 8 మంది చూపు కోల్పోయారని ఆ రాష్ట్ర వైద్య విద్య పరిశోధన డైరెక్టరేట్ అధిపతి తాత్యారావు లహానే చెప్పారు. ఇదిలా ఉండగా గుజరాత్ ప్రభుత్వం ఈ రోగులకు ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తోంది. ఫంగస్ బాధితుల వైద్యం కోసం 5000 వయస్స్ సేకరించింది. గుజరాత్ రాష్ట్రంలో ఇంతవరకు వంద కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో 19 మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో అరవై పడకల వంతున రెండు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. వడోదర, సూరత్, రాజ్‌కోట్, భావనగర్, జామ్‌నగర్, తదితర ప్రాంతాల్లో ఇటువంటి సదుపాయాలు ఏర్పాటు అవుతున్నాయి. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రూ.3.12 కోట్లతో యాంపోటెరిసిన్ వయల్స్ 5000 వరకు కొనుగోలు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News