Thursday, January 23, 2025

బాబోయ్… ఔటర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఔటర్‌పై నెలకు 18 నుంచి 30 వరకు ప్రమాదాలు జరుగుతుండగా ఈ సంఘటనలో మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉం టుంది. గతంలో ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించే వాహనాలకు 100 కిలోమీటర్ల వేగానికి పరిమితం చేసిన అధికారులు గత సంవత్సరం క్రితం వేగాన్ని 120 కి.మీల కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఔటర్‌పై ప్రయాణించే వేగాల నియంత్రణ కష్టం గా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయించిన 120 కి.మీల వేగాన్ని సైతం ఎవరూ పాటించకపోవడం కూడా ఈ ప్రమాదాలు జరగడానికి దారితీస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాద హెచ్చరికలు ఉన్నా వాహనదారులు దానిని పాటించటం లేదని, 130 కి.మీల నుంచి 150 కి.మీ. వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని అధికారులు తెలిపారు.

వాహనాలు రిపేరుకు వచ్చినా, డ్రైవర్లకు విశ్రాంతి అవసరమైనా దానికి కావాల్సిన సౌకర్యాలు ఔటర్ రింగు రోడ్డుపై ఉన్నాయి. నిర్ణీత దూరానికి ఒకటి చొప్పున బ్రేక్‌డౌన్ పాయింట్స్‌ఉన్నాయి. అక్కడ లారీలు మొదలుకొని కార్ల వరకు ఎవరైనా తమ వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. అయితే, చాలా మంది తమ వాహనాలను ఔటర్‌పై ఎక్కడ పడితే అక్కడ ఎడమ వైపు పార్కింగ్ చేస్తున్నారు. ఇది కూడా ప్రమాదాలకు దారి తీస్తోంది. 2022 సంవత్సరంలో 170 ప్రమాదాలు జరగ్గా అందులో 146 మంది గాయపడగా, 30 మంది మృత్యువాత పడ్డారు. 2023 సంవత్సరంలో 216 ప్రమాదాలు జరగ్గా అందులో 135 మంది గాయపడగా, 81మంది మృత్యువాత పడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News