Thursday, December 26, 2024

కారు టాపుపై యువకుల హల్‌చల్: ట్రాఫిక్ పోలీసుల చలాన్

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: కారు టాపులపైన, బానెట్‌లపైన కూర్చుని నగర వీధుల్లో హల్ చల్ చేసిన కొందరు యువకులపై చండీగఢ్ పోలీసులు కొరడా ఝలిపించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకువారికి చలాన్లు విధించడమేగాక వారి డ్రైవింగ్ లైసెన్సులు జప్తు చేసుకున్నారు.

ఇటీవల చండీగఢ్‌లోని దోఇణ్ మార్గ్‌లో కొందరు యువకులు కార్ల ర్యాలీ నిర్వహించారు. కార్ల టాపుల మీద, బానెట్‌ల మీద కూర్చోవడంతోపాటు డోర్లు, విండోల నుంచి తలలు బయటపెట్టి విన్యాసాలు చేయడం వంటి చేష్టలకు ఆ యువకులు పాలడ్డారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ 18 సెకండ్ల వీడియోను చూసిన ఒక నెటిజన్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఈ యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ నెటిజన్ డిమాండ్ చేశాడు. దీంతో స్పందించిన చండీగఢ్ ట్రాఫిక్ పోలీసులు పంజాబ్, చండీగఢ్ రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా ఆ వాహనాల యజమానులకు చలానాలు విధించారు. ఇప్పటివరకు ముగ్గురు యువకుల డ్రైవింగ్ లైసెన్సులను ట్రాఫిక్ పోలీసులు జప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News