Saturday, December 21, 2024

అంగట్లో అమ్మపాలు!

- Advertisement -
- Advertisement -

చెన్నైలో రూ. 500 ధరకు 100 మిల్లీ లీటర్ల తల్లి పాలు విక్రయించిన ఒక దుకాణానికి భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) సీల్ వేసి, పాల శాంపిళ్లను శాస్త్రీయ పరిశోధన కోసం స్వాధీనం చేసుకున్నది. మనిషి పాల అమ్మకం జరుగుతోందని ఫిర్యాదు రావడంతో ఆ దుకాణంపై పది రోజులుగా నిఘా వేసి ఉంచినట్లు అధికారులు తెలియజేశారు. అయితే, ఆ పది రోజుల్లో అమ్మకం ఏదీ జరగకపోయినప్పటికీ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించడం తల్లి పాల నిల్వల స్వాధీనానికి దారి తీసింది. ‘ఒక బ్యాచ్ 100 ఎంఎల్ సీసాల్లో శుద్ధి చేసిన తల్లి పాలు ఉన్నాయని,

మరొక బ్యాచ్ సీసాలపై దాత మహిళల పేర్లు ఉన్నాయని తిరువళ్లూరు ఆహార భద్రత విభాగం డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం జగదీష్ చంద్ర బోస్ ఒక టివి చానెల్‌తో చెప్పారు. ‘పాల శుద్ధికి వారు ఏ ప్రక్రియ అనుసరించారో మాకు తెలియదు. దర్యాప్తు అనంతరం తదుపరి చర్య తీసుకుంటాం’ అని ఆయన తెలిపారు. బహిరంగ విపణిలో తల్లి పాల విక్రయం జరుగుతోందని ఫిర్యాదులు రావడంతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ మే ప్రథమార్ధంలో ఒక సలహా పత్రం జారీ చేసింది. మనిషి పాలు, వాటి ఉత్పత్తుల వాణిజ్యీకరణకు సంబంధించిన కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాలని సంస్థ హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News