Saturday, December 21, 2024

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

- Advertisement -
- Advertisement -

చార్మినార్: నగరంలో గురువారం పూర్తి ఆధ్యాత్మికత సంతరించుకుంది. ఒకే రోజు బక్రీద్, తొలి ఏకాదశి పర్వదినం రావడంతో మతసామరస్యం వెల్లువిరిసింది. త్యాగాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్‌ను పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుకోగా, ఉగాది తర్వాత తెలుగువారికి తొలి పండగ అయిన తొలి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా జరుకున్నారు. దీంతో ఒకవైపు మసీదులతో పాటు ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలతో కిటకిటలాడగా, మరోవైపు గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన దేవాలయాలు తెల్లవా రుజాము నుంచే భక్తులతో కిక్కిరిసిపోయాయి. రెండు పండుగలు ఒకేసారి రావడంతో అటు ముస్లిం సోదరులకు హిందువులు ఈద్ ము బారక్ తెలపుగా హిందువులకు ముస్లిం సోదరులు పం డుగ శుభాకాంక్షలు తెలపడంతో నగరంలో మత సామరస్యం వెల్లువెరిసింది.

నగరంలోని ముస్లిం సోదరులు బక్రీద్ పం డుగను భక్తి శ్రద్ధ్దలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరూ ఆలింగనం చేసుకుని పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తాగ్యనిరితికి పత్రీకైన బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజ్ ను నిర్వహించారు. దీంతో నగరంలో మసీదులు, ఈద్గాలన్ని కిటకిటాలాడాయి. మసీదులు, ఈద్గాల వద్ద పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రక మీరాలం ఈద్గాతో పాటు మక్కా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థలను నిర్వహించారు. అనంతరం పలువురు మత పెద్దలు ఆ ధ్యాత్మిక ప్రసంగం చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా ప్రభుత్వం తరుపున ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. జిహెచ్‌ఎంసి మసీదులు, ఈద్గాలతో ప్రత్కేక బృందాలను ఏర్పాటు చేసిన ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్ర పర్చారు. పోలీసులు నగర వ్యాప్తంగా అన్ని మసీదులు, ఈద్గాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రార్థన వేళాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లీంచారు. అదేవిధండా బక్రీద్ సందర్భంగా పెద్ద ఎత్తున ఖుర్బానీ ఇవ్వడంతో పాతబస్తీలో జిహెచ్‌ఎంసి స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు.

తొలి ఏకాదశి పర్వదినాన్ని నగరవాసులు కనుల పండువగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే మంగళ సా న్నాలను ఆచరించి తమ ఇష్టదైవాన్ని దర్శించుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిమాయత్ నగర్‌లోని వెంకటేశ్వ స్వామి ఆలయం, బిర్లామందిర్‌తో పాటు పలు వెంకటేశ్వర ఆలయాలు, బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దేవాలయం తదితర ప్రముఖ ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. నగరంలోని పలు ప్రముఖ ఆలయాలన్ని తెల్లవారుజాము నుంచే భక్తులతో కిక్కిరిసిపోయారు. దీంతో భక్తులకు ఏలాంటి ఇబ్బందు లు కల్గకుండా ఆయా దేవాలయాల కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు పలు ఆలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

బక్రీద్ పండగను పురస్కరించుకొని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఈద్గా వద్ద ముస్లీంలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలనంతరం ముస్లింలను ఆలంగినం, కరచాలనం చేసి పండగ అభినందనలు తెలియజేశారు. సీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు సైతం ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. కాగా మజ్లిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంపులో మజ్లిస్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి, మజ్లిస్ కార్పొరేటర్లతో కలిసి ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

బక్రీద్ పండగ వ్యర్థాలను జీహెచ్‌ఎంసి అధికారులు ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఎప్పటికప్పుడు తొలగించారు. పోలీసులు ఒక్కరోజు ముందుగానే ఇంటింటికి ప్రత్యేకంగా ప్లాస్టిక్ బ్యాగులను పంపిణీ చేశారు. జీహెచ్‌ఎంసి, పోలీసులు సమన్వయంతో వ్యవహరించి బస్తీలలో పారిశుధ్య సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. జీహెచ్‌ఎంసి దక్షిణ మండలం జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ పర్యవేక్షణలో అధికారులు తమ సిబ్బందితో కలిసి వ్యర్థాలను తొలగించారు. ప్రత్యేక వాహనాల ద్వారా బస్తీలలో పొగైన వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించారు. సాయంత్రం వరకు వంద ట్రిప్పులలో వ్యర్థాలను అక్కడ నుండి తొలగించారు. ఈ సందర్భంగా అశోక్ సామ్రాట్ మాట్లాడుతూ పారిశుధ్య స మస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఉదయం నుండే జీహెచ్‌ఎంసి సిబ్బంది స్థానిక పోలీసుల సహాకారంతో వ్యర్థాల తొలగింపు పనులలో నిమగ్నమైయ్యారని వెల్లడించారు. వ్యర్థాల తొలగింపు రాత్రి వరకు కొనసాగాయని, శుక్రవారం కూడ తమ సిబ్బంది వ్యర్థాలను తొలగించనున్నుట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News