Monday, December 23, 2024

అగ్నిపథ్ దరఖాస్తులో ‘కులం’ కాలమ్‌పై రగడ

- Advertisement -
- Advertisement -

Outrage on 'Caste' column in Agnipath application

పాత విధానంలోనే రిక్రూట్‌మెంట్ : రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ : అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా అభ్యర్థుల కులం, మతం సర్టిఫికెట్లను అడుగుతున్నారని అనేక మంది విపక్షనేతలు, బిజెపి మిత్ర పక్షం మంగళవారం తీవ్రంగా ధ్వజమెత్తాయి. అయితే ఇవన్నీ వదంతులే అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ తోసిపుచ్చారు. ఆర్‌జేడీ నేత తేజస్వియాదవ్, ఆప్ నేత సంజయ్‌సింగ్ , జేడియు నేత ఉపేంద్ర కుష్వాహా, బిజెపి ఎంపి వరుణ్ గాంధీ తదితరులు కులం ప్రస్తావన తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై అధికార పార్టీ బీజేపీ స్పందిస్తూ ఇవి సైనికులను కించపర్చడం, అవమానించడమేనని ఎదురు దాడి చేసింది. పార్లమెంట్ ఆవరణలో పాత్రికేయులతో కేంద్రమంత్రి రాజ్‌నాధ్ సింగ్ మాట్లాడుతూ పాత విధానం ప్రకారమే అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ జరుగుతోందని వివరించారు. స్వాతంత్రానికి పూర్వం నుంచి ఉన్న విధానాన్నే కొనసాగిస్తున్నామని చెప్పారు. బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఈ విధానాన్ని సమర్ధించారు. 1947 తరువాత స్పెషల్ ఆర్డర్ రూపొందిందని, అప్పటినుంచి అదే కొనసాగుతోందని పేర్కొన్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో 2013లో సుప్రీం కోర్టులో దాఖలైన వ్యాజ్యానికి సంబంధించి ఆర్మీ సమర్పించిన అఫిడవిట్‌లో రిక్రూట్‌మెంట్‌లో కులం, మతం పాత్ర ఏదీ ఉండబోదని వివరించిందని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News