Sunday, December 22, 2024

విషాదం.. ‘డియర్ రజనీ.. నన్ను క్షమించు’ లేఖ రాసి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సూర్యాపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వసీమ్ అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. తనను క్షమించాలంటూ భార్యకు రాసిన సూసైడ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘డియర్ రజనీ. నిన్ను చాలా బాధపెట్టా. మనకు ఎవరూ లేరు. పిల్లలు అలా కాకూడదని చాలా ఊహలు కన్నా. కానీ ఏదీ కుదరలేదు. వచ్చే జన్మలో నా పిల్లలకే కొడుకుగా పుడతా’ అని రాశారు. తాను కొందరి వద్ద చేసిన అప్పును చెల్లించాలని భార్యను వసీమ్ కోరారు. అయితే.. సరిగ్గా జీతాలు రాక, కుటుంబ సమస్యలు ఎక్కువ కావడంతో వసీమ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ ఘటనపై మాజీ మంత్రి కెటిఆర్ స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలని మండిపడ్డారు. “సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వసీమ్ అనే ఉద్యోగి 3 నెలలుగా జీతాలు రాక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణానికి బాధ్యులెవరు?” అని ఎక్స్ వేదికగా కెటిఆర్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News