Sunday, January 19, 2025

కలెక్టరేట్ సాక్షిగా అక్షర ఏజెన్సీ ఆగడాలు

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల : జిల్లాలో రిజిస్ట్రేషన్ లేకున్నా అక్షర ఏజెన్సీకి పర్మీషన్ ఇచ్చిన అధికారి ఎవరు..? ఆరు నెలలుగా జీతాల కోసం పారిశుధ్య కార్మికులు ఎదురుచూస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కార్మికుల ధర్నాచేపట్టి, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సాక్షిగా ఔట్ సోర్సింగ్ కార్మికులు నిండా మోసపోయారు. ఎలాంటి అనుమతులు లేకున్నప్పటికీ కొంత మంది రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, మరి కొంత మంది అధికారుల ప్రమేయం వల్ల కరీంనగర్ కు చెందిన అక్షర ఏజెన్సీ ఇక్కడ టెండర్లు దక్కించుకొని అమాయక ప్రజలను మోసం చేసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామంటూ ఒక్కొక్క పారిశుధ్య కార్మికుని వద్ద నుండి లక్ష నుండి 1 లక్షా 50 వేల వరకు లంచంగా తీసుకున్నట్లు పారిశుధ్య కార్మికులు ఆరోపిస్తున్నారు.

తమకు ఉద్యోగం ఉంటుందని, తమ కుటుంబాలు బాగుపడతాయని కష్టపడి ఏజెన్సీకి డబ్బులు చెల్లించినట్లు కార్మికులు పేర్కొంటున్నారు. అయితే గత ఆరు నెలలుగా గుత్తేదారు కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన బాటపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అదే విధంగా నస్పూర్ పోలీస్ స్టేషన్ లో సైతం గుత్తేదారుపై ఫిర్యాదు చేశారు. వివాదాస్పదమవుతున్న గుత్తేదారు వైఖరికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అక్షర ఏజెన్సీ ద్వారా నియమింబపబడ్డ ఔట్ సోర్సింగ్ పారిశుద్య కార్మికుల సమస్యలపై ఒక పత్రిక విలేఖరి కథనాలు రాయగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోనే గుత్తేదారు అతన్ని బెధిరించాడని సమాచారం. ఈ వివాదం చిలికి చిలికి గాలివానై పోవడంతో జిల్లా ఉన్నతాధికారులు కల్పించుకొని వివాదాన్ని సద్దుమనిగించినట్లు తెలుస్తుంది. గుత్తేదారు ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోవడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఆయనపై చర్యలు తీసుకోకవడానికి కలెక్టర్ కార్యాలయంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారో అర్ధం కావడం లేదు.

అవినీతిలో కలెక్టర్ కార్యాలయం అధికారుల హస్తం ఏమైనా ఉందా..? లంచాల్లో వాటా తీసుకున్నారా..? లేక అధికారులే గుత్తేదారు వెనుక నుంచి ప్రేరేపిస్తున్నారా అనే అంశాలపై జిల్లాలో చర్చ జరుగుతుంది. కలెక్టర్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు, కార్మికులు నష్టపోతుంటే వారికి న్యాయం చేయలేని జిల్లా యంత్రాంగం ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తారు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే 12 మంది వర్కర్ల వద్ద నుండి దాదాపు 14 లక్షల వరకు ఇచ్చామని ఇంచార్జి రాకేష్ పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు గురువారం రాత్రి అక్షర ఏజెన్సీ ఎండి గుర్రం శ్రీనివాల్రావుతో పాటు మందమర్రికి చెందిన శ్రీనివాస్, మంచిర్యాలకు ఎందిన వినోద్ ల పై కేసు నమోదు చేసినట్లు ఎస్పై రవికుమార్ తెలిపారు. జీతం ఇచ్చినప్పుడే తీసుకోవాలట… ఔట్ సోర్సింగ్ సూపర్వైజర్ రాజేష్ కరీంనగర్ కు చెందిన అక్షర ఏజెన్సీ గుత్తేదారు తమను కాంట్రాక్టు బేసిక్ పై పనిలోకి తీసుకొని ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదు.

వేతనాలు అడిగితే మేము ఇచ్చినప్పుడు తీసుకోవాలంటూ బెధిరిస్తున్నాడు. ఈ విషయంపై తమ తోటి కార్మికులతో కలిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం. తమకు ఉద్యోగాలు ఉంటాయని, కుటుంబాలు బాగుపడతాయని భావించి లక్షలు లంచం ఇచ్చి ఉద్యోగాలు పొందాం. సదరు గుత్తేదారు పని చేయించుకొని వేతనాలు అడిగితే ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నాడు. చేసేదేమి లేక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News