Monday, December 23, 2024

ఔట్ సోర్సింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

- Advertisement -
- Advertisement -

ఉట్నూర్ : గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని గురుకులాల్లో పని చేస్తున్నా కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్, క్యాటరింగ్, స్వీపింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాంనాయక్ హామీ ఇచ్చారు. ఆదివారం ఉట్నూర్ పర్చటనకు వచ్చిన ఎమ్మెల్యే రేఖనాయక్‌ను తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల బోధనేతర సిబ్బంది సంఘం ఆధ్వర్యంలో పలు డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందించారు. ఈ సందర్బంగా నాయకులాల్లో పని చేస్తున్నా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యూలర్ చేయాలని, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే జీతాలను చెల్లించాలని గత 20 సంవత్సరాల నుండి పని చేస్తున్నా కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యూలర్ చేయాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 12 నెలలతో కూడిన వేతనాలను ఇవాలన్నారు.

మహిళ ఉద్యోగులకు ఆరు నెలల జీతాలతో కూడిన ప్రసూతి సేలవులు ఇవ్వాలని ,మహిళ ఉద్యోగులకు వారి వ్యక్తిగత అవసరాల కొరకు 5 రోజుల పాటు అదనంగా సెలవులు ఇచ్చి ప్రతీ ఉద్యోగికి సంవత్సరానికి రెండు వేల ఇంక్రిమెంట్లు అందించి, ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే 10 లక్షలు, సహజ మరణం అయితే రూ. 5 లక్షల పరిహారం అందించాలని కోరార. స్పందించిన ఎమ్మెల్యే ఈ సమస్యల పై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లీ సమస్యల సాధనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఈ సంఘం నాయకులు అశోక్, సుంగు బాబులాల్ , సుజాత, హేమంత్,రాజేందర్, సాధిక్, కేశవ్, గజానంద్, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News