- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో ఔట్ సోర్సింగ్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని మంత్రి సీతక్కను ఆ సంఘం నాయకులు కోరారు. ఆమెకు శనివారం వినతిప్రతం అందజేసిన అనంతరం మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాసి మెరిట్, రోస్టర్ పాయింట్ల ద్వారా ఎంపికై ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో జెపిఎస్‌లతో పాటుగా సమానంగా పనిచేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ఔట్ సోర్సింగ్ జూనియర్ పంచాయతీ కార్యదర్శి నుంచి జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా గుర్తించాలని కోరారు.
- Advertisement -