- Advertisement -
న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల(యుటి) వద్ద ఇప్పటికీ 1.60 కోట్ల డోసులకు పైగా కొవిడ్-19 టీకాలు అందుబాటులో ఉన్నాయని, రానున్న మూడు రోజుల్లో మరో 2.67 లక్షలకు పైగా టీకా డోసులను సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. రాష్ట్రాలు, యుటిలకు ఇప్పటి వరకు 21 కోట్ల డోసులకు పైగా టీకాలను సమకూర్చినట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో వృథా అయిన డోసులను కూడా కలుపుకుని ఈ నెల 21వ తేదీ వరకు సగటున 19,73,61,311 డోసుల టీకాల వినియోగం జరిగిందని శాఖ తెలిపింది. రాష్ట్రాలు, యుటిల వద్ద ఇంకా వ్యాక్సినేషన్ చేయవలసిన 1.60 కోట్ల (1,60,13,400) డోసులకు పైగా టీకాలు అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో 2,67,110 టీకా డోసులు రాష్ట్రాలు, యుటిలకు అందుతాయని వివరించింది.
- Advertisement -