Sunday, December 22, 2024

దేశంలో కోటి ఫ్లాట్స్ ఖాళీగా పడి ఉన్నాయి: జి. హరిబాబు

- Advertisement -
- Advertisement -

ఉపయోగించకుండా ఆస్తులుంచుకోవడం ఒక విధంగా నేరం!

హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీమియమైజేషన్ పెరిగిపోతున్నట్లు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (NAREDCO) జాతీయ ప్రెసిడెంట్ జి. హరిబాబు అభిప్రాయపడ్డారు. ఆఫర్డేబుల్ ఇళ్లకు డిమాండ్ ఉన్నప్పటికీ వాటి సప్లయ్ తక్కువగానే ఉందన్నారు. 2019 నుంచి 2013 మధ్య కాలంలో రూ. 1.5 కోట్లకు మించిన రెసిడెన్షియల్  యూనిట్లు 1000 శాతం పెరిగాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ పేర్కొంది. ఏడు ప్రధాన నగరాలలో రూ. 75 లక్షల కన్నా తక్కువ ఉన్న లేక ఆఫర్డేబుల్ ఇళ్ల సప్లయ్ మందకొడిగా ఉందని  అగ్గమ్ వాలియాకు మాటామంతీలో పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో కేవలం హై నెట్వర్త్ వ్యక్తులకే అవకాశం ఉంటోదన్నది పచ్చి నిజం.

మెట్రో నగరాలలో కేవలం హై నెట్ వర్త్ ఉన్నవారే ఇళ్లను కొనగలుగుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో వారిదే హవా నడుస్తోంది. మెట్రో నగరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారులే కథ అంతా నడుపుతున్నారు.

హరిబాబు కథనం ప్రకారం 2022లో హైదరాబాద్ లో 5300 ఆఫర్డబుల్ హోమ్స్ లేక ఫ్లాట్స్ అమ్ముడయ్యాయి. కానీ 2023 కల్లా అమ్మడయినవి దాదాపు 1500 ఫ్లాట్సే. అదే సమయంలో లగ్జరీ ఇండ్లు ఎక్కువ అమ్ముడయ్యాయి. కొందరి ఆస్తులు కూడా గణనీయంగా పెరిగాయి. కానీ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే మాత్రం నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనబడుతోంది. 31.5 శాతం సంపద కేవలం 1 శాతం మంది చేతుల్లోకి వెళ్లిపోయింది. మరో 31.5 శాతం సంపద 9 శాతం మంది చేతుల్లోకి పోయింది. లెక్క ప్రకారం రియల్ ఎస్టేట్ రంగం కేవలం 10 శాతం మాత్రమే వృద్ధి చెందింది. అంటే 14 కోట్ల మందే ఆ డబ్బు పెట్టి ఇండ్లు కొనుకున్నారు. చాలా మంది రియల్ ఎస్టేట్ బిల్డర్లు కేవలం 10 శాతం మందికి అనుగుణంగానే ఇండ్లను కట్టి అమ్ముతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News