Wednesday, January 22, 2025

2022లో భారతీయ పౌరసత్వం వదులుకున్న 2.25 లక్షల మంది పౌరులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కర్నాటకకు చెందిన 10,000 మందికి పైగా పౌరులు 2014 నుంచి 2022 మధ్య భారత ప్రభుత్వం జారీచేసిన తమ పాస్‌పోర్టులను ప్రభుత్వానికి స్వాధీనం చేశారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం రాజ్యసభలో వెల్లడించింది.

2022లో మొత్తం 2,25,620 మంది పౌరులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని మంత్రిత్వశాఖ ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. 2014లో యుపిఐ ప్రభుత్వం స్థానంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టినపుడు ఈ సంఖ్య 1,29,328 ఉన్నట్లు తెలిపింది.

ఢిల్లీకి చెందిన 60,414 మంది పౌరులు భారత ప్రభుత్వం జారీచేసిన పాస్‌పోర్టులను స్వాధీనం చేయగా పంజాబ్‌కు చెందిన 28,117 మంది, గుజరాత్‌కు చెందిన 22,202 మంది, గోవాకు చెందిన 18,610 మంది, మహారాష్ట్రకు చెందిన 17,171 మంది, 2014 నుంచి 2022 మంధ్య తమ పాస్‌పోర్టులు స్వాధీనం చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు.

కేరళలో మొత్తం 16,247 మంది భారతీయులు, తమిళనాడులో 14,046 మంది, కర్నాటకలో 10,245 మంది తమ పాస్‌పోర్టులను స్వాధీనం చేశారని ఆయన తెలిపారు.

2019లో అమెరికాలోని భారత కాన్సులేట్లు, ఎంబసీ వద్ద కేవలం ఐదుగురు భారతీయులు మాత్రమే తమ పాస్‌పోర్టులు స్వాధీనం చేయగా 2022లో 8048 మంది స్వాధీనం చేశారని ఆయన తెలిపారు. అదే విధంగా 2019లో కెనడాలోని భారతీయ దౌత్య, కాన్సులర్ మిషన్ల వద్ద 28 మంది భారతీయులు మాత్రమే తమ పాస్‌పోర్టులు స్వాధీనం చేయగా 2022లో 6507 మంది తమ పాస్‌పోర్టులు స్వాధీనం చేశారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News