Thursday, November 21, 2024

తుపాను హెచ్చరికతో 150 పైగా రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

పెను తుపాను తాకిడి అవకాశం ఉన్న దృష్టా ఆగ్నేయ రైల్వే (ఎస్‌ఇఆర్) పరిధిలో 150 పైగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు ఎస్‌ఇఆర్ అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. పెను తుపానుఈ నెల 25న ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలను తాకవచ్చునని ఆయన సూచించారు. రద్దు చేసిన రైళ్లలో హౌరా సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, కామాఖ్య యశ్వంత్‌పూర్ ఎసి ఎక్స్‌ప్రెస్, హౌరా పూరి శతాబ్ది ఎక్స్‌ప్రెస్, హౌరా భువనేశ్వర్‌శతాబ్దిఎక్స్‌ప్రెస్, హౌరా యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ కూడా ఉన్నట్లు ఆయన తెలియజేశారు.

రద్దు చేసిన రైళ్లు బుధవారం (23) నుంచి 25 వరకు ఆయాస్టేషన్ల నుంచి బయలుదేరవలసి ఉన్నదని ఎస్‌ఇఆర్ అధికారి తెలిపారు. పరిస్థితిని బట్టి ఎస్‌ఇఆర్ జోన్ మీదుగా నడిచే మరిన్ని రైళ్లను రద్దు చేయవచ్చు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పెను తుపానుగా మారి 25 తెల్లవారు జామున పూరి, సాగర్ దీవి మధ్య ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాన్ని దాటవచ్చు. ఆసమయంలో గాలి వేగం గంటకు 100110 కిమీ మేర ఉండవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News