Sunday, December 22, 2024

దక్షిణ కొరియాలో హాలోవీన్ హర్రర్.. 151మంది మృతి

- Advertisement -
- Advertisement -

Over 151 killed in Halloween Crowd Surge in South Korea

దక్షిణ కొరియాలో హాలోవీన్ హర్రర్
తొక్కిసలాటలో 151కు చేరిన మృతుల సంఖ్య
150మందికి పైగా తీవ్ర గాయాలు
అర్ధరాత్రివేళ పెనువిషాదంగా ఆల్‌సెయింట్స్ డే వేడుకలు
హామిల్టన్ సమీప ఇరుకుప్రాంతంలో గుండెపోటుతో కుప్పకూలిన బాధితులు
140 అంబులెన్సుల్లో క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు
సియోల్ దుర్ఘటన మృతుల్లో కొరియన్లతోపాటు విదేశీయులు
సియోల్: దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో శనివారం జరిగిన పెనువిషాదం దేశవాసులకు పీడకలగా మారింది. ఇటేవాన్‌లో జరిగిన హాలోవీన్ వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందినవారి సంఖ్య పెరిగింది. తొక్కిసలాటలో 150మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. తొక్కిసలాట సందర్భంగా సందుల్లో బాధితులు గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వీరిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిప్రాథమిక చికిత్స అందించి తీవ్రంగా కృషి చేశారు. ఇటేవాన్‌లో శనివారం హాలోవీన్ వేడుకలకు సుమారు లక్షమందికిపైగా అంచనా వేశారు. మెగాసిటీలోని ఈప్రాంతంలో ఆధునిక బార్లు, వినోద కేంద్రాలు ఉంటాయని స్థానిక మీడియా తెలిపింది. నగరంలోని రెండు అతిపెద్ద పార్కులు, వార్ మెమోరియల్ ఆఫ్ కొరియా మ్యూజియం మధ్య ఉండే ఇటేవాన్ పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధిచెందింది. నైట్‌లైఫ్ ఎక్కువగా ప్రధాన రహదారిపై కేంద్రీకృతమై ఉంటుంది. దక్షిణ కొరియాలో పాశ్చాత్య శైలి కార్యకలాపాలు విస్తృతంగా లేనప్పటికి నేపథ్యం పార్టీలు, ఈవెంట్లు యువ దక్షిణ కొరియన్లలో బాగా ప్రాచుర్యం పొందాయి. దీంతో బార్లు, క్లబ్‌లు, రెస్టారెంట్లు ఎక్కువగా ఉండే ఇటేవాన్ ఆ దేశ మారింది. ఈ ప్రాంతం సమీపంలోనే యూఎస్ మిలటరీ కేంద్రం ఉండటంతో అమెరికా కమ్యూనిటీకి కావాల్సిన ఆహార పానీయాలు అందించే రెస్టారెంట్లు, బార్లు ఇతర వ్యాపారాలకు ఇటేవాన్ నిలయంగా ఉంది.

ప్రస్తుతం దళాలు దక్షిణ కొరియాలోని తమ ప్రధాన కార్యాలయాన్ని 70కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్చినా విదేశీ సందర్శకులకు, కొరియన్లకు ఈ ప్రాంతం ప్రధాన ఆకర్షణగా మిగిలిపోయింది. తొక్కిసలాట ఘటన హామిల్టన్ హోటల్‌కు పశ్చిమవైపు ఉన్న ఇరుకైన ఏటవాలు సందులో జరిగిందని సాక్షులు తెలిపారు. కొవిడ్ నిబంధనలు సడలించిన అనంతరం రెండు సంవత్సరాల విరామం తర్వాత వేడుకలు జరుగుతుండటంతో భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆ ప్రాంతానికి సినీతార ఒకరు రావడంతో ఆమెను చూసేందుకు జనం ఎగబడటంతో తొక్కిసలాట జరిగిందని స్థానిక మీడియా పేర్కొంది. శనివారం సమయం అర్ధరాత్రికి ముందు సమీపంలో డజన్లు కొద్ది ప్రజలు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారని కొరియా హెరాల్డ్ తెలిపింది. రాత్రి 10.30 సమయంలో శ్వాస పీల్చుకోవడానికి పడ్డారని శాఖ తెలిపారు. గంట వ్యవధిలోనే బాధితుల సంఖ్య దాటిపోయిందని నివేదికలో పేర్కొన్నారు. గుండెపోటుతో పడిపోయినవారిని సైతం బాధితుల ఛాతీని అదిమి బతికించేందుకు చేసిన ప్రయత్నం వీడియోల్లో నమోదైంది. ఆదివారం నాటికి సంఖ్య 151కి పెరిగింది. గాయపడినవారిలో అధికంగా 20ఏళ్లలోపు యువతులు ఉన్నారని స్థానిక మీడియా నివేదించింది.

తొక్కిసలాటలో గాయపడినవారిని సంఘటన ప్రాంతం నుంచి ఆసుపత్రులకు తరలించారని ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు మీడియాకు తెలిపారు. తొక్కిసలాటకు ముందు ట్విటర్ యూజర్లు ఆ ప్రాంతానికి రావొద్దని బయటవారిని అప్రమత్తం చేశారు. ఇటేవాన్‌లో నియంత్రించలేనంతగా జనసమ్మర్దం ఉందని పేర్కొన్నారు. గాయపడిన కొంతమంది తమ గాయాలను చూపుతూ వీడియోలను కూడా పోస్టు చేసి ఔత్సాహికులను హెచ్చరించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సమాచారం అందగానే తొలుత తమ అధికారప్రతినిధితో ప్రకటన జారీ చేశారు. బాధితులకు అన్ని మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలు, అధికార యంత్రాంగం, విభాగం సహకారాలు అందించి ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ప్రతి ఏడాది అక్టోబర్ 31 రాత్రి ప్రపంచ దేశాలు హాలోవీన్ వేడుకలు నిర్వహిస్తాయి. చనిపోయినవారి ఆత్మలు ఆల్ సెయింట్స్ డే సందర్భంగా నవంబర్ 1న వారి నివాసానికి తిరిగి వస్తాయని పాశ్చాత్యదేశవాసులు విశ్వసిస్తారు. ఈ సందర్భంగా పలికేందుకు విచిత్ర వేషధారణ, దుస్తులతో సంబరాలు జరుపుతారు.

Over 151 killed in Halloween Crowd Surge in South Korea

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News