- Advertisement -
న్యూఢిల్లీ : శనివారం ఉదయానికి 15 నుంచి 18 ఏళ్ల లోపు వయసు వారు రెండు కోట్ల మందికి పైగా మొదటి డోసు తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ వయసు వారికి జనవరి 3 నుంచి టీకా వేస్తున్నారు. మరోవైపు జనవరి 10 నుంచి ప్రికాషన్ డోసులు అందించడానికి కేంద్రం సన్నద్ధమౌతోంది. దీనికోసం శనివారం నుంచి అపాయంట్‌మెంట్లు ప్రారంభిస్తున్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ డోసుకు అర్హులైన వారు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. శుక్రవారం నాటికి దేశంలో డోసుల పంపిణీ 150 కోట్లు దాటడంతో టీకా పంపిణీలో భారత్ మరో కీలక మైలురాయి అధిగమించిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు వయోజన జనాభాలో 91 శాతం మందికి పైగా కనీసం ఒక డోసు తీసుకోగా, 66 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు.
- Advertisement -