హైదరాబాద్: జనగాంలో నీటి శుద్ధికి ఏర్పాటుచేసిన ట్యాంక్ నుంచి క్లోరిన్ వాయువు లీక్ కాగా, దానిని పీల్చిన 20 మంది అస్వస్థులయ్యారు. వారిని వెంటనే జిల్లా ఆసుపత్రికి వెంటనే తరలించారు. ఆ ప్రాంతం చుట్టుప్రక్కల ఉన్నవారు ఊపిరిపీల్చుకోవడం కష్టంగా ఉందని, దగ్గొస్తుందని, వాంతులొస్తున్నాయని ఫిర్యాదు చేశారు. వారిని గురువారం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరాక వారి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. వారికి చికిత్స అందుతోంది. అయితే వారిలో కొందరిని డిశ్చార్జి కూడా చేశారు. కాగా ఈ విషయంపై అధికారులు దర్యాప్తును చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చాక జనగాం పట్టణవాసులు కాస్త కుదుటపడ్డారు.
20 people wre rushed 2Jangaon Govt Hospital after thy complained of difficulty breathing nd vomiting aftr gas leakage frm chlorine tank installed 4r cleaning water in Jangaon Municipality Limits on Thursday night. @XpressHyderabad @NewIndianXpress @Kalyan_TNIE @maheemahesh25 pic.twitter.com/3lYT9JCVkB
— R V K Rao_TNIE (@RVKRao2) February 17, 2023