Monday, December 23, 2024

విధ్వంసం నుంచి పునరుద్ధరించిన పాక్ ఆలయంలో ప్రార్ధనలు

- Advertisement -
- Advertisement -

Over 200 Hindu pilgrims pray at renovated Pak temple

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో రాడికల్ ఇస్లామిస్ట్ పార్టీ ఏడాది క్రితం ధ్వంసం చేసిన మహరాజా పరమహంసజీ మందిరాన్ని పునరుద్ధరించడంతో ఆదివారం దాదాపు 200 మంది హిందూ యాత్రికులు ప్రార్ధనలు, పూజలు చేశారు. పకడ్బందీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ ప్రార్ధనలు జరిగాయి. భారత్ నుంచి దాదాపు 200 మంది, దుబాయ్, గల్ఫ్ దేశాలు, అమెరికా నుంచి 15 మంది వరకు ఈ ప్రార్ధనల కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయువ్య ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లో పరమహంసజీ సమాధి ఉంది. 2020 లో అల్లరి మూక దీన్ని ధ్వంసం చేయడం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన చెలరేగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News