Friday, November 15, 2024

పాక్‌లో 22 లక్షల మంది హిందువులు

- Advertisement -
- Advertisement -

Over 22 lakh Hindus in Pakistan

మొత్తం జనాభాలో 1.18 శాతం హిందువులు

పేషావర్: పాకిస్తాన్ మొత్తం జనాభాలో అల్ప సంఖ్యాక వర్గానికి చెందిన హిందువులు 1.18 శాతం ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం పాకిస్తాన్ మొత్తం జనాభా 18,68,90,601 ఉండగా మైనారిటీ వర్గమైన హిందువులు 22,10,566 మంది ఉన్నట్లు సెంటర్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పాకిస్తాన్ నివేదిక పేర్కొంది. నేషనల్ డాటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ(ఎన్‌ఎడిఆర్‌ఎ)సేకరించిన వివరాల ప్రకారం పాకిస్తాన్ మొత్తం జనాభాలో మైనారిటీ మతస్తులు ఐదు శాతం లోపే ఉండగా అందులో హిందువులు అత్యధికంగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి నమోదైన పాకిస్తాన్ మొత్తం జనాభా 18,68,90,601 కాగా అందులో 18,25,92,000 మంది ముస్లింలే. ఎన్‌ఎడిఆర్ నుంచి కంప్యూటరైజ్డ్ నేషనల్ ఐడెంటిటీ కార్డులు పొందిన మైనారిటీలపై సేకరించిన వివరాల ప్రకారం పాక్‌లో 17 విభిన్న మతాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో 1400 మంది నాస్తికులు కూడా ఉన్నారు. పాక్‌లో హిందువులు 22,10,586 మంది, క్రైస్తవులు 18,73,348, అహ్మదీలు 1,88,340 మంది, సిక్కులు 74,130 మంది, భాయిస్ 14,537 మంది, పార్సీలు 3,917 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరు కాగా మరో 2,000 లోపు మంది 11 ఇతర మైనారిటీ మతాలకు చెందిన వారు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News