Wednesday, January 22, 2025

కమ్మేసిన పొగమంచు..300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యం

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు అలముకుంది. వరుసగా రెండో రోజు వాయునాణ్యత సూచీ 400 పైబడింది. దాంతో సమీపం లోని దృశ్యాలు కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ ఎఫెక్ట్ విమానాల రాకపోకలపై పడింది. 300 లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయని ఫ్లైట్ రాడార్ 24 సంస్థ వెల్లడించింది. ఢిల్లీకి రావాల్సిన 115 విమానాలు , అక్కడ నుంచి బయలుదేరాల్సిన 226 సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది. ఈ పరిస్థితులపై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్, విమానయాన సంస్థలు ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. ఈ కాలుష్యంపై ఢిల్లీ మంత్రి గోపాల్‌రాయ్ స్పందించారు. “ ఈ సీజన్‌లో తొలిసారి రెండు రోజులుగా వాయు నాణ్యతా సూచీ 400 పైనే నమోదైంది.

అక్టోబర్ 14 నుంచి 400 దిగువన ఉన్న ఈ సూచీ ఎందుకు పెరిగిందనే ప్రశ్న అందరి మదిలో ఉంది. పర్వతాల వద్ద మంచు కురుస్తుండటంతో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ విభాగం నిపుణులు వెల్లడించారు. అందుకే ఉత్తరభారతంలో పొడివాతావరణం నెలకొంది. అలాగే రేపటి నుంచి కాలుష్యం స్థాయిలు తగ్గడానికి అవకాశముంది. ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3 ని అమలు చేయట్లేదు” అని మంత్రి తెలిపారు. ఈ ప్లాన్ అమల్లోకి వస్తే అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం ఉంటుంది. ఐదులోపు తరగతుల విద్యార్థులకు సెలవు ఇస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News