Saturday, December 21, 2024

ఎపి నుంచి మీషో పై 330కు పైగా లక్షాధికారులైన విక్రేతలు

- Advertisement -
- Advertisement -

అసలైన ఈ–కామర్స్‌ మార్కెట్‌ ప్రాంగణం, మీషోకు 2022 సంవత్సరం అద్వితీయమైన సంవత్సరంగా నిలిచింది. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్‌ వాణిజ్యంను చేరువచేయాలనే లక్ష్య సాకార దిశగా ఎన్నో మైలురాళ్లను మీషో చేరుకుంది. ఈ సంవత్సరం అమ్మకాల పరంగా మూడు రికార్డులను మీషో చేరుకుంది. ప్రతి ఒక్కటి గతం కంటే మిన్నగా ఉండటం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అందుబాటు ధరలలో నాణ్యమైన వస్తువులను కోరుకునే వినియోగదారులు, మా ప్రతి రోజూ అతి తక్కువ ధరలతో కూడిన విస్తృత శ్రేణి ఉత్పత్తులను ఎంచుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి అధిక సంఖ్యలో ఎంఎస్‌ఎంఈలు గత సంవత్సర కాలంలో మీషోపై చేరారు. కంపెనీ యొక్క ,పరిశ్రమలో మొట్టమొదటి కార్యక్రమాలైనటువంటి జీరో కమీషన్‌ మరియు జీరో పెనాల్టీ ల ఫలితమిది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి గత 12 నెలల కాలంలో దాదాపు 330 మంది లక్షాధికారులుగా మారారు. ఈ సంవత్సరం, రాష్ట్రం నుంచి మీషో పై చేరిన సరఫరాదారుల సంఖ్య 37%కు పైగా పెరిగింది. వీరిలో 70% మంది తమ ఈ–కామర్స్‌ ప్రయాణాన్ని మీషోతో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వినియోగదారులు కొనుగోలు చేయడానికి అమిత ఆసక్తిని కనబరుస్తున్న ఉత్పత్తులలో స్మార్ట్‌ వాచ్‌లు, వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌, ఇయర్‌ ఫోన్స్‌, బాడీ లోషన్స్‌ మరియు కుర్తీలు ఉంటున్నాయి.

దేశ వ్యాప్తంగా ప్రాంతాలు, సామాజిక ఆర్ధిక పూర్వాపరాలతో సంబంధం లేకుండా ఈ–కామర్స్‌ వేగంగా వృద్ధి చెందుతుండటంతో, మీషో ఇప్పుడు దేశపు సహజసిద్ధమైన వినియోగదారుల సంఖ్యకు ప్రాప్యత, లభ్యతను మరింతగా పెంచుతుంది. 2022లో ఇండియా ఏ విధంగా కొనుగోలు చేసినదో వెల్లడించే కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తే…

· 2022లో మా విక్రేతలు 3700 కోట్ల రూపాయలను కమీషన్‌లను చెల్లించనవసరం లేకుండా ఆదా చేసుకోగలిగారు. దీనికి పరిశ్రమలో మా మొట్టమొదటి జీరో కమీషన్‌ మోడల్‌ తోడ్పడింది.

· భారతదేశ వ్యాప్తంగా ఎస్‌ఎంబీలు డిజిటలీకరించబడ్డాయి – 2022లో మీషో పై 5 లక్షల మంది సరఫరాదారులు చేరారు. వీరిలో 61% మంది ఈ–కామర్స్‌కు రావడం తొలిసారి కావడంతో పాటుగా ఆన్‌లైన్‌లో విక్రయించడం తొలిసారి.

భారతదేశపు షాపింగ్‌ ప్రైమ్‌ టైమ్‌

· ఆదివారాలంటే విశ్రాంతి తీసుకోవడానికే అని భావించవచ్చు కానీ, భారతీయులు మాత్రం ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయడానికి అత్యంత అనువైన రోజుగా భావిస్తున్నారు. 2022లో ఆదివారం ఎక్కువగా కొనుగోళ్లు జరిపారు. అంతకు ముందు సంవత్సరం అది బుధవారంగా ఉంది.

· ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు మీషోకు షాపింగ్‌ ప్రైమ్‌టైమ్‌గా కొనసాగింది. 2021లో మధ్యాహ్నం 2–3 గంటలలో అధికంగా ట్రాఫిక్‌ కనిపించేది.

· లక్షలాది మంది వినియోగదారులు స్థానిక ల్యాండ్‌మార్క్‌లు అయిన పిపాల్‌ క పేడ్‌, బర్గాద్‌ కా పేడ్‌ ; అట్టా చక్కీ కీ పీచే మరియు నియర్‌ వాటర్‌ ట్యాంక్‌ వంటివి వినియోగించడం ద్వారా డెలివరీ పర్సనల్‌కు సహాయపడ్డారు. అంతేకాదు, దేశీ నేవిగేషన్‌ టూల్‌ యొక్క ఖచ్చితత్త్వం ముందు డిజిటల్‌ మ్యాప్స్‌ పోటీపడలేవు !

ఇండియా తనపట్ల తాను పూర్తి శ్రద్ధ చూపుతుంది

· 2022లో ఎక్కువ మంది వెదికిన రెండవ ఉత్పత్తిగా స్మార్ట్‌ వాచ్‌ నిలిచింది. ఇది శారీరక వ్యాయామాల పట్ల భారతదేశం ఎంతటి ఆసక్తి చూపుతుందో తెలుపుతుంది

· గ్రూమింగ్‌ ఉత్పత్తులకు పురుషులు అమిత ఆసక్తి చూపుతున్నారు. టియర్‌ 4 మార్కెట్‌ల నుంచి 60% కు పైగా ఆర్డర్లు లభించాయి.

· శానిటరీ న్యాప్కిన్స్‌కు ఆర్డర్లు 9 రెట్లు టియర్‌ 2 నగరాల నుంచి పెరిగాయి. ఇది భారత్‌లోని లక్షలాది మంది మహిళలకు ఈ–కామర్స్‌ ఏ విధంగా చేరువవుతుందో చూపుతుంది.

2022 షాపింగ్‌ కార్ట్‌

· నిమిషానికి 148 చీరలు విక్రయించబడ్డాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి డిమాండ్‌ కనిపించింది. భారతదేశపు ప్రేమ ఈ వస్త్రానికి కొనసాగుతుంది.

· 93వేల టీషర్టులు, 51, 275 బ్లూ టూత్‌ ఇయర్‌ఫోన్లు మరియు 21,662 లిప్‌స్టిక్స్‌ ప్రతి రోజూ విక్రయించబడ్డాయి.

మీషో గురించి:

భారతదేశపు ఒకే ఒక్క అసలైన ఈ–కామర్స్‌ మార్కెట్‌ ప్రాంగణం మీషో. వ్యక్తిగత వ్యాపారవేత్తలు సహా 100 మిలియన్‌ల మంది చిరు వ్యాపారులను ఆన్‌లైన్‌లో సైతం విజయం సాధించేలా చేయాలనే లక్ష్యంతో, ఇంటర్నెట్‌ కామర్స్‌ను మీషో ప్రజస్వామ్యీకరిస్తుంది. అంతేకాదు విస్తృత శ్రేణి ఉత్పత్తులను వినియోగారులకు ఆన్‌లైన్‌లో తీసుకువస్తుంది. మీషో మార్కెట్‌ ప్రాంగణం, ఎస్‌ఎంబీలు, ఎంఎస్‌ఎంఈలు, వ్యక్తిగత వ్యాపారవేత్తలు సహా చిరు వ్యాపార సంస్థలను లక్షలాది మంది వినియోగదారులకు చేరువ చేస్తుంది. దాదాపు 30కు పైగా విభాగాల నుంచి ఎంచుకునే అవకాశం కల్పిస్తూనే, భారతదేశ వ్యాప్తంగా లాజిస్టిక్స్‌, చెల్లింపు సేవలు, కస్టమర్‌ సపోర్ట్‌ సామర్ధ్యం సంతరించుకుని సమర్ధవంతంగా తమ వ్యాపారాలను మీషోపై నిర్వహించుకునే అవకాశం అందిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News