Monday, January 27, 2025

భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

- Advertisement -
- Advertisement -

మూడు పోలీస్ కమిషనరేట్లలో నమోదు
హైదరాబాద్‌లో 1,243, సైబరాబాద్‌లో 1,241. రాచకొండలో 517
మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలు
కేసులు నమోదు చేసిన పోలీసులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎంతలా చెప్పిన మద్యం ప్రియులు వినలేదు. కొత్త సంవత్సర వేడుకల్లో మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడ్డారు. ఇలా పట్టుబడిన వారిలో హైదరాబాద్, సైబరాబాద్, రాకకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు హైదరాబాద్‌లో 1,243, సైబరాబాద్‌లో 1,241, రాచకొండలో 517మందిపై కేసులు నమోదు చేశారు. నూతన సంవత్సర వేడుల్లో ఎలాంటి అవాఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశారు. మద్యం తాగి వాహనాలను నడుపవద్దని పోలీసులు ముందుగానే విస్కృతంగా ప్రచారం చేశారు.

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామని, లైసెన్స్‌లను రద్దు చేసేందుకు ఆర్టిఓలకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. దానికి అనుగుణంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు రాత్రి 9గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడం ప్రారంభించారు. దీంతో మద్యం మద్యంతాగి వాహనాలు నడుపుతున్న వారు భారీగా పట్టుబడ్డారు. చాలా ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేయడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే ఆగిపోయింది. నగరంలోని అబిడ్స్, ఆసిఫ్ నగర్, బహదూర్‌పురా, బంజారాహిల్స్, కెబిఆర్ పార్క్, బేగంపేట, చార్మినార్, చిక్కడపల్లి, ఫలక్‌నూమ, గోపాలపురం, గోషామహల్, హైదరాబాద్ ట్రాఫిక్ సెల్, జూబ్లీహిల్స్, కాచిగూడ, మహంకాళి, మలక్‌పేట, మారేడ్‌పల్లి, మీర్‌చౌక్, నల్లకుంట, నాంపల్లి, నారాయణగూడ, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్, టోలీచౌకి,సైదాబాద్, సుల్తాన్ బజార్, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి తర్వాత తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో నగరంలో 1,243 మంది వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతు పట్టుబడ్డారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 66మంది మందుబాబులు పట్టుబడ్డారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిలో ఎక్కువగా 19 నుంచి 30 సంవత్సరాల వారు 688మంది, 31 నుంచి 40 ఏళ్ల వారు 324మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. రాత్రి 11 నుంచి 12 గంటల వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 265మంది పట్టుబడ్డారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం తాగి పట్టుబడిన వారిలో టూవీలర్ల వారు 1,066 మంది, 3 వీలర్ వారు 42, ఫోర్ వీలర్ వారు 135మంది పట్టుబడ్డారు. కమిషనరేట్ పరిధిలో పట్టుబడిన వారిలో పురుషులు 1,239, మహిళలు ఇద్దరు, ఇతరులు ఇద్దరు ఉన్నారు.

సైబరాబాద్‌లో…
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతు 12,41మంది పట్టుబడ్డారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 253మంది మందుబాబులు పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్,మియాపూర్, కూకట్‌పల్లి, బాలానగర్, జీడిమెట్ల, అల్వాల్, రాజేంద్రనగర్, శంషాబాద్, గచ్చిబౌలి, షాద్‌నగర్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిలో 26 నుంచి 35 ఏళ్ల యువకులు 536 మంది ఉన్నారు. గత ఏడాది వీరు 703 మంది పట్టుబడగా, ఈ ఏడాది వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది.

18 నుంచి 25 ఏళ్ల వారు 382మంది, 35 నుంచి 45ఏళ్ల వారు 239మంది, 46 నుంచి 60ఏళ్ల వారు 78మంది ఉన్నారు. ఇందులో అత్యధికంగా టూవీలర్ల వారు 938మంది పట్టుబడగా, త్రీవీలర్లు 21, ఫోర్ వీలర్లు 275, హెవీ వెహికిల్స్ 7 పట్టుబడ్డారు. మాదాపూర్‌లో 98, కూకట్‌పల్లిలో 123 మంది పట్టుబడ్డారు. మియాపూర్‌లో 253, బాలానగర్‌లో 70, జీడిమెట్ల 80, అల్వాల్ 73, రాజేంద్రనగర్ 57, శంషాబాద్‌లో 67, గచ్చిబౌలిలో 86, షాద్‌నగర్ 33, చేవెళ్ల 37, నార్సింగి 81, రాయదుర్గంలో 45, కెపిహెచ్‌బిలో 75, మేడ్చల్‌లో 63, గచ్చిబౌలి 86, చేవెళ్ల 37 మంది మద్యంతాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డడ్డారు.

పట్టుబడ్డ వారిలో పురుషులు 1,239మంది, మహిళలు 2 ఉన్నారు. మద్యం తాగి పట్టుబడిన వారిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మాదాపూర్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో వారికి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి రూ.10,000 చొప్పున జరిమానా విధించనున్నారు. అంతేకాకుండా వారికి శిక్షతోపాటు సామాజిక సేవ చేయాల్సిందిగా ఆదేశించనున్నారు. కొత్త ఏడాదిలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. డిడి తనిఖీల్లో 300 నుంచి 500కుపైగా బిఏసి వచ్చిన వారు 51మంది ఉన్నారు, 100నుంచి 149 వచ్చిన వారు 281, 51 నుంచి 99 వచ్చిన వారు 485, 150 నుంచి 199 వచ్చిన వారు 128, 200 నుంచి 299 వచ్చిన వారు 100మంది ఉన్నారు.

రాచకొండలో…
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 517మంది వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కౌన్సెలింగ్ అనంతరం వారికి వాహనాలు అందివ్వనున్నారు. కుషాయిగూడ, ఎల్‌బి నగర్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం, మల్కాజ్‌గిరి, చౌటుప్పల్, భువనగిరి, యాదాద్రిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిలో 21 నుంచి 30 ఏళ్ల యువకులు 223 మంది పట్టుబడ్డారు.

ముందుగానే చెప్పినా…
నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి వాహనాలు నడపవద్దని సైబరాబాద్ పోలీసులు ముందుగానే కోరారు. అయినా కూడా వాహనదారుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఎప్పటి వలనే మద్యం తాగి వాహనాలు నడిపుతూ పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారిలో అత్యున్నత విద్యావంతులు, పేరుప్రఖ్యాతులు ఉన్న సంస్థల్లో పనిచేస్తున్న వారు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News