- Advertisement -
40వేల మంది నిరాశ్రయులయ్యారు!
డర్బన్: దక్షిణాఫ్రికాలో వరదలు వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. శనివారం కురిసిన వానలకు 400 మంది మరణించగా, 40వేలకుపైగా జనులు నిరాశ్రయులయ్యారు. వరద నీరు డర్బన్ నగరం ఈశాన్య తీరం జలమయం అయింది. రోడ్లు, ఆసుపత్రులు, ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. క్వా జులూ-నటాల్ ప్రాంతంలో ఎమర్జెన్సీ సర్వీసులను అప్రమత్తం చేశారు. 35 లక్షల మంది నివసించే డర్బన్ నగరానికి మానవతా సాయం అందుతోంది. వారికి ఈస్టర్ పండుగ లేకుండా పోయింది. మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి. వరదల వల్ల వినాశనం అపారంగా ఉంది. దళాలు, పోలీసులు, వాలంటీర్లు అన్వేషణ, రెస్కూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
- Advertisement -