Thursday, January 23, 2025

మా పిల్లలకూ వైవాహిక సమానత్వం ప్రసాదించండి

- Advertisement -
- Advertisement -

మా పిల్లలకూ వైవాహిక సమానత్వం ప్రసాదించండి
సిజెఐకి లేఖ రాసిన 400 మంది స్వలింగ సంపర్కుల తల్లిదండులు
న్యూఢిలీ: స్వలింగ సంపర్కులయిన తమ పిల్లలకు కూడా వైవాహిక సమానత్వం మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ దాదాపు 400 మంది తల్ల్లిదండ్రులు స్వలింగ వివాహాలపై విచారణ జరపుతున్న ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశంపై ధర్మాసనం నాలుగో రోజు విచారణ జరుపుతున్న సమయంలో ‘ స్వీకార్ ది రెయిన్‌బో పేరెంట్స్’ అనే గ్రూపు రాసిన ఈ లేఖ ప్రాధానతను సంతరించుకుంది. ‘ మా పిల్లలు, వారి భాగస్వాములు తమ సంబంధానికి మన దేశంలోని స్పెషల్ మ్యారేజ్ చట్టం కింద చట్టపరమైన ఆమోదాన్ని పొందడాన్ని చూడాలని మేము కోరుకుంటున్నాం. భిన్నమైన భారతీయ సంస్కృతిని గౌరవించే, మినహాయించిన వర్గం యొక్క విలువల కోసం నిలబడే మనలాంటి పెద్ద దేశం మా పిల్లల కోసం కూడా వైవాహిక సమానత్వం గేట్లను తెరుస్తుందని మేము కోరుకుంటున్నాం’ అని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

Also Read: గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ సింగ్‌కు జైలు నుంచి విముక్తి.. హతుని భార్య ఆవేదన..

తమలో చాలా మంది వృద్ధులవుతున్నామని, కొంతమంది 80 ఏళ్లకు చేరుకున్నారని, తాము జీవించి ఉండగానే తమ పిల్లల రెయిన్‌బో వివాహానికి చట్టబద్ధ గుర్తింపు లభిస్తుందని తాము ఆశిస్తున్నామని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. స్వలింగ సంపర్కుల్లోని లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌లాంటి ఏడు వర్గాల(ఎల్‌జిబిటిక్యు ఐఎ)కు చెందిన పిల్ల్లల తల్లిదండ్రులు ఈ ‘స్వీకార్ ది రెయిన్‌బో పేరెంట్స్’గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. ‘వైవాహిక సమానత్వాన్ని పరిశీలించాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం’ అని వారు సిజెఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తమ పిల్లల జీవితాలు, మనోభావాలు, కోరికలు కూడా న్యాయమైనవేనని అర్థం చేసుకోవడానికి తమకు చాలా సమయం పట్టిందని, వైవాహిక సమానత్వాన్ని వ్యతిరేకించే వారు కూడా తమతో ఏకీభవించి వారి వైవాహిక జీవితాలకు చట్టబద్ధత కల్పించేందుకు దోహదపడతారని ఆశిస్తున్నామని వారు పేర్కొన్నారు. భారతీయులు, దేశ రాజ్యాంగం. ప్రజాస్వామ్యం పట్ల తమకు నమ్మకం ఉందని కూడా వారు తెలిపారు.

నాలుగో రోజు హైబ్రిడ్ విచారణ
ఇదిలా ఉండగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్లపై విచారణ జరుపుతున్న రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం నాలుగో రోజు కూడా తన విచారణను కొనసాగించింది. అయితే ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు విచారణలో వర్చువల్‌గా పాల్గొన్నారు. సిజెఐ డివై చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ పిఎస్ నరసింహ తమ స్థానాల్లో ఆసీనులు కాగా న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్, ఎస్‌ఆర్ భట్‌లు వర్చువల్‌గా వారితో చేరారు. జస్టిస్ కౌల్ కిందపడి కోలుకొంటూ ఉండడం, మరో జడ్జి జస్టిస్ భట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినందున ఈ రోజు తాము హైబ్రిడ్ ధర్మాసనంగా విచారణ జరుపుతున్నట్లు సిజెఐ చంద్రచూడ్ తెలిపారు.

రోజంతా విచారణ కొనసాగనున్నందున ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అవసరమయితే మధ్యలో కొద్ది సేపు బ్రేక్ తీసుకోవచ్చని కూడా జస్టిస్ కౌల్‌కు సిజెఐ సూచించారు. కాగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గీతా లూథ్రా తన వాదనలను వినిపించడంతో నాలుగో రోజు విచారణ మొదలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News