Monday, November 18, 2024

జార్ఖండ్ లోని దుమ్కాలో 400కు పైగా గ్రామస్తులు ఓటింగ్ ను బహిష్కరించారు

- Advertisement -
- Advertisement -

దుమ్కా, జార్ఖండ్: కోల్ డంపింగ్ యార్డు నిర్మాణానికి నిరసనగా దుమ్కా జిల్లాలోని ఒక గ్రామంలో 400 మందికి పైగా ప్రజలు శనివారం లోక్‌సభ ఎన్నికల ఏడో దశ పోలింగ్‌ను బహిష్కరించినట్లు అధికారి తెలిపారు.

దుమ్కా లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన బగ్దుభి గ్రామంలోని బూత్ నంబర్ 94లో మొత్తం 426 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని తెలిపారు.

బూత్‌లో నమోదైన 430 మంది ఓటర్లలో నలుగురు ఓటర్లు మాత్రమే మధ్యాహ్నం 3 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని దుమ్కా సర్కిల్ ఆఫీసర్ అమర్ కుమార్ పిటిఐ వార్తా సంస్థకి తెలిపారు. రైల్వేశాఖ కోల్‌ డంపింగ్‌ యార్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారన్నారు.

సబ్‌డివిజనల్‌ అధికారి అజయ్‌ కుమార్‌ గ్రామస్తులతో సమావేశం నిర్వహించి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. అయితే, వారు ఓటు వేయడానికి మాత్రం అంగీకరించలేదు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News