Saturday, November 23, 2024

మణిపుర్ నుంచి మిజోరంకు 5800 ప్రజలు వలస

- Advertisement -
- Advertisement -

ఐజ్వాల్: హింసాత్మక మణిపుర్ నుండి 5800 మందికి పైగా ప్రజలు మిజోరంకు పారిపోయి వివిధ జిల్లాల్లో తలదాచుకున్నారని అధికారులు ఆదివారం తెలిపారు. మిజోరంలోని ఆరు జిల్లాల్లోని చిన్‌కుకి మిజో కమ్యూనిటీకి చెందిన మొత్తం 5822 మంది తాత్కాలిక సహాయ శిబిరాల్లో మకాం వేసినట్లు వారు తెలిపారు. ఐజ్వాల్ జిల్లాలో ప్రస్తుతం 2021 మంది స్థానభ్రంశం చెందారు, ఆ తర్వాత స్థానాల్లో కొలాసిట్ 1847, సైచువల్ 1790 స్థానభ్రంశం చెందారు.ఇదిలావుండగా గిరిజనులకు ప్రత్యేక పరిపాలన ఉండాలన్న డిమాండ్‌ను మణిపుర్ గిరిజన ఎంఎల్‌లు ముందుంచగా, మిజోరం లోక్‌సభ సభ్యుడు సి. లాల్‌రో సంగ సమర్థించారు.
షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ) హోదా కోసం మైతేయి కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న కొండ జిల్లాల్లో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించడంతో మణిపుర్‌లో ఘర్షణలు చెలరేగాయి.

మణిపుర్ జనాభాలో మెయిటీలు దాదాపు 53 శాతం ఉన్నారు. ఇంఫాల్ లోయలో వారు ఎక్కువగా నివసిస్తున్నారు. గిరిజనులు, నాగాలు, కుకీలు జనాభాలో 40 శాతం వరకు ఉన్నారు. వారంతా కొండ జిల్లాల్లో నివసిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News