Wednesday, January 22, 2025

60 కి పైగా విమానాలకు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

భారతీయ విమానాలకు సోమవారం కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ రోజు 60కి పైగా విమానాలలో బాంబులు పెట్టారనే హెచ్చరికలు మొత్తం మీద వెలువడటంతో భద్రతా యంత్రాంగం అప్రమత్తం అయింది. ఇప్పుడు 21ఎయిరిండియా, 21 ఇండిగో, 20 విస్తారా విమానాలకు బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. గడిచిన 15 రోజులలో సామాజిక మాధ్యమాలు, ఫోన్ల ద్వారా ఈ బాంబు బెదిరింపుల తంతు ఎక్కువవుతూ వస్తోంది. దాదాపుగా ప్రతిరోజూ ఇటువంటి సమాచారం అందడం, ఎయిర్‌పోర్టులలో క్షుణ్ణంగా తనిఖీలు జరగడం పరిపాటి అయింది. పక్షం రోజుల్లో ఇప్పటివరకూ 410 వరకూ జాతీయ, అంతర్జాతీయ ప్రయాణ విమానాలకు బాంబు బెదిరింపుల సమాచారం అందింది.

సోదాల తరువాత చాలా వరకూ ఇవి అన్ని బూటకపు బెదిరింపులు అని స్పష్టం అయింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చలలో ఇటువంటి బాంబు బెదిరింపుల కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వివాదాస్పద లేదా అరాచక సామాజిక మాధ్యమ ఖాతాదారులపై చర్యలు తీసుకునే బాధ్యత ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాలపై ఉందని స్పష్టం చేసింది. ఉత్తుతి బెదిరింపులనే విషయం స్పష్టం అవుతూ ఉన్నా, ఎక్కడా ఎటువంటి జాప్యం నిర్లక్షం లేకుండా వెంటనే విమానాల తనిఖీలకు దిగడం , భద్రతాయుతం అని నిర్థారించుకున్న తరువాతనే విమాన ప్రయాణాలకు అనుమతిని ఇస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News