Sunday, December 22, 2024

మూడేళ్లలో రాష్ట్రాలపై 60 లక్షల ఫిర్యాదులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై 2020 నుంచి ఈ ఏడాది నవంబర్ వరకూ 60 లక్షలకు పైగా ప్రజా ఫిర్యాదులు అందాయని రాజ్యసభలో కేంద్రం గురువారం తెలిపింది. కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పర్యవేక్షణ వ్యవస్థ (సిపిగ్రామ్స్) పరిధిలో గత మూడేళ్లుగా వివిధ విషయాలపై ఫిర్యాదులు అందుతున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ రాతపూర్వక సమాధానంలో తెలిపారు.

ఈ విభాగానికి ప్రజలు తమ సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు వ్యతిరేకంగా తెలియచేసుకోవచ్చు. ఈ విభాగానికి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి, తగు రీతిలో పరిష్కరించడం జరుగుతోందని మంత్రి తెలిపారు. ఈ మధ్యకాలంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ పై ఫిర్యాదులు అందాయి, ఇవి 12లక్షలకు పైగా ఉన్నాయి. తరువాతి క్రమంలో మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు, తెలంగాణపై మొత్తం 1,19,122 ప్రజా ఫిర్యాదులు అందగా వీటిలో ఇప్పటికీ 2770 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News