Wednesday, January 22, 2025

గిన్నిస్‌లోకి కొత్తగా 60కి పైగా భారత్ ఘనతలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గిన్సిన్ బుక్ 2024లో భారతదేశపు 60కి పైగా ఘనతలు చోటుచేసుకోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది గిన్నిస్ రికార్డు బుక్‌లో మొత్తం 2638 విశేషాలు నమోదు అవుతాయి. భారతదేశంలోని చిరపుంజిలో అత్యధిక వర్షపాతం అత్యంత ప్రాచీనమైన రికార్డుల వరుసలో ఒకటిగా ఉంది. వచ్చే ఏడాది గిన్నిస్ కొత్త చేరికల గురించి ఇప్పుడు పెంగ్విన్ రాండమ్ హౌస్ బుక్‌లో పొందుపర్చారు. ఇందులో 9 వాస్తవిక నిర్థారిత అంశాలతో కూడిన అధ్యాయాలు పొందుపర్చారు. బ్లూప్లానెట్, అక్వాటిక్ లైఫ్, హ్యుమన్స్, రికార్డాలజి, అడ్వెంచర్స్, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్, మీడియా, స్పోర్ట్ వంటి వివిధ రంగాలను తీసుకుని అరుదైన ఘనతలను గిన్నిస్ రికార్డుల బుక్‌లో పొందుపర్చారు. ఇందులోనే ఐదు ప్రత్యేక అనుబంధాలను కూడా జతచేర్చారు. ఇక భారతదేశానికి సంబంధించినంతవరకూ అత్యంత పురాతనమైన పరిణామం చిరపుంజి వర్షపాతాన్ని ప్రపంచంలోనే అతి భారీ వర్షపాత రికార్డుగా గుర్తించారు.

1995 జూన్ 15, 16 తేదీలలో మేఘాలయాలో అత్యంత ఎతైన ప్రాంతంలో ఉండే చిరపుంజిలో 48 గంటల వ్యవధిలో 2,493 మీటర్ల మేర ( 8 అడుగుల రెండు అంగుళాల) మేర వర్షం కురిసింది. మొత్తం వర్షాకాలపు సగటు వర్షపాతం ఈ ఒక్కరోజే కురిసినట్లు విశ్లేషించారు. భారతీయ శిల్పి కనాయి కున్హిరమన్ తీర్చిదిద్దిన 1937 నాటి జలకన్యక శిల్పం , అత్యంత వేగంగా కారులో ఆరు ఖండాలు చుట్టివచ్చిన ఘనత వహించిన దంపతులు సాలూ చౌదురి, నీనాచౌదురిల రికార్డు నిలిచింది. భారతీయ జానపద సంగీతకారుడు థంగ డార్లాంగ్ అత్యంత వృద్ధుడైన కళాకారుడుగా నిలిచారు. 2019లో ఆయనకు పద్యశ్రీ పురస్కారం అందిన నాటికి ఆయన వయస్సు 98 ఏండ్లు పైబడింది. అత్యంత మరుగుజ్జు మహిళగా నాగ్‌పూర్‌లో నివసిస్తున్న జ్యోతి ఆంగే ఉన్నారు. కేవలం 62.8 సెంమీలు ( 24.7 అంగుళాలు ) ఎత్తుతో ఉన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద పొడవైన విలాసవంతమైన ప్రైవేటు హౌస్‌గా ముఖేష్ అంబానీకి చెందిన 27 అంతస్తుల ఆకాశహార్మం ఆంటిలియా రికార్డుల్లోకి చేరింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో నెటిజన్ల సెర్చ్ జరిగిన కట్టడంగా తాజ్‌మహల్ రికార్డుల్లోకి చేరింది. 2022 మార్చి నెలలో తాజ్‌మహల్ గురించి 1.4 మిలియన్ల మంది సెర్చ్ చేశారు. 3500 ఎపిసోడ్స్‌తో ఇప్పటికీ కొనసాగుతున్న సీరియల్‌గా సాబ్ టీవీలో వస్తోన్న తారక్ మెహతా కా ఊట్లా ఛష్మా కూడా రికార్డుల్లో చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News