Monday, December 23, 2024

హైకోర్టులలో 71వేలు, సుప్రీంలో 70వేల పెండింగ్ కేసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో 30 సంవత్సరాలుగా 71000కు పైగా కేసులు వివిధ హైకోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి. కాగా దిగువ కోర్టులలో ఇదే దశలో 1.01 లక్షల కేసులు విచారణల దశలో నిలిచాయి. కాగా జిల్లా, సబార్డినేట్ కోర్టులలో ఈ పెండింగ్ కేసుల సంఖ్య గత 30 ఏళ్లుగా 1,01,837గా ఉంది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుక్రవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు.

ఈ నెల 20వ తేదీన ఎగువసభలో ఆయన పెండింగ్ కేసులపై సమాధానంలో వివిధ స్థాయిల కోర్టులలో వీటి సంఖ్య ఇప్పుడు 5.02 కోట్లకు చేరిందని వివరించారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 69,766 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రోజురోజుకీ పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోవడానికి పలు కారణాలు ఉన్నాయని, జడ్జిల ఖాళీలే ఏకైక కారణం కాదని మంత్రి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News