Friday, November 22, 2024

ఐటిఆర్ ఫైలింగ్‌లో కొత్త రికార్డు

- Advertisement -
- Advertisement -

డిసెంబర్ 31 నాటికి 8.18 కోట్ల రిటర్న్‌ల దాఖలు

న్యూఢిల్లీ : దేశంలో ఐటిఆర్(ఆదాయం పన్ను రిటర్న్) ఫైలింగ్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది. దేశంలో రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 8 కోట్లు దాటింది. ఈమేరకు ఆర్థిక శాఖ గణాంకాలను విడుదల చేసింది. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసిన వారి సంఖ్య 8.18 కోట్లకు చేరింది. దాదాపు 9 శాతం పెరిగింది. సమాచారం ప్రకారం, 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరంలో మొత్తం 1.60 కోట్ల ఆడిట్ నివేదికలు, ఇతర ఫామ్‌లు పూరించారు. గతేడాది ఈ సంఖ్య 1.43 కోట్లుగా ఉంది.

సోమవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య రికార్డు సృష్టించింది. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరంలో మొత్తం 8.18 కోట్ల ఐటిఆర్‌లు దాఖలు కాగా, అంతకుముందు ఏడాది(202223) ఇదే సంఖ్య 7.51 కోట్లుగా ఉంది. మంత్రిత్వ శాఖ ప్రకారం, జీతం, వడ్డీ, డివిడెండ్, వ్యక్తిగత సమాచారం, టిడిఎస్ సహా పన్ను చెల్లింపు, నష్టం, ఎంఎటి క్రెడిట్ సహా అనేక సమాచారం ఇప్పటికే సేకరించారు. ఈ సౌకర్యాన్ని విస్తృతంగా ఉపయోగించారు. ఐటిఆర్ ఫైల్ చేసే ప్రక్రియ మునుపటి కంటే చాలా సులభం, సౌకర్యవంతంగా, వేగంగా మారింది. ఐటిఆర్ ఫైల్ చేసే వారు దీని వల్ల చాలా లాభపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News