Tuesday, April 15, 2025

ఏడాదిన్నరలో పాక్ నుంచి 8.60 లక్షల మందికి పైగా ఆఫ్ఘన్ల నిష్క్రమణ

- Advertisement -
- Advertisement -
  • ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో సరిహద్దు గుండా 5 లక్షల మందికి పైగా ఆఫ్ఘన్‌లోకి ప్రవేశం

ఇస్లామాబాద్ : 2023 సెప్టెంబర్ నుంచి 8.60 లక్షల మందికి పైగా ఆఫ్ఘన్లు పాకిస్తాన్ నుంచి వెళ్లిపోయినట్లు, ఖైబర్‌పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని సరిహద్దు క్రాసింగ్‌ల ద్వారా ఐదు లక్షల మందికి పైగా ఆఫ్ఘనిస్తాన్‌లోకి ప్రవేశించినట్లు మీడియా వార్తలు వెల్లడించాయి. ఆఫ్ఘన్ పౌరుల కార్డులు (ఎసిసి) ఐచ్ఛిక వాపసుకు గడువు ముగిసిన అనంతరం ఈ నెల 1న ఆఫ్ఘన్ శరణార్థులను తిప్పిపంపే ప్రక్రియ రెండవ దశను పాకిస్తాన్ ప్రారంభించింది. పాకిస్తాన్‌లో నివసిస్తున్న ఆఫ్ఘన్ల దశలవారీ పునరావాస కార్యక్రమం కింద మొదటి దశ 2023లో మొదలైంది. పాకిస్తాన్‌లో అక్రమంగా నివసిస్తున్న ఆఫ్ఘన్లను తిప్పి పంపనున్నట్లు పాక్ ప్రభుత్వం 2023లో ప్రకటించింది. అంతర్జాతీయ వలసదారుల సంస్థ (ఐఒఎం)నుంచి సేకరించిన డేటా ప్రకారం, 2023 సెప్టెంబర్ 15 నుంచి ఈ నెల 5 వరకు 861763 మంది ఆఫ్ఘన్లు తమ దేశానికి తిరిగి వెళ్లినట్లు ‘డాన్’ దినపత్రిక వెల్లడించింది. అధికార డేటా ప్రకారం, ఐదు లక్షల మందికి పైగా ఖైబర్ పఖ్వూన్‌ఖ్వా (కెపి) ప్రావిన్స్‌లోని రెండు క్రాసింగ్‌ల ద్వారా వెళ్లిపోయారు. శుక్రవారం 4908 మంది ఆఫ్ఘన్ శరణార్థులు పాకిస్తాన్ నుంచి నిష్క్రమించారు. సుమారు 2475 మందికి ఎసిసి ఉన్నట్లు,వారు పాకిస్తాన్‌లో చట్టబద్ధంగా నివసిస్తున్నట్లు సమాచారం. వారిలో 2125 మంది ఐచ్ఛికంగా దేశం వదలి వెళ్లిపోయారు. 350 మందిని కెపిలోని తోర్ఖామ్ సరిహద్దు ద్వారా పంపివేశారు. ఈ నెల 1న ఆఫ్ఘన్ జాతీయులను తిప్పి పంపే కార్యక్రమం రెండవ దశ ప్రారంభమైనప్పటి నుంచి 16242 మంది ఎసిసి కార్డుదారులు పాకిస్తాన్ నుంచి వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News