- Advertisement -
న్యూఢిల్లీ : టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ దేశ వ్యాప్తంగా 87,000 మందికి కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. పూర్తిగా టీకా తీసుకున్న వారిలో అత్యధికంగా కేరళలో 46 శాతం మంది కరోనా బారిన పడినట్టు వెల్లడించారు. కేరళలో టీకా తొలి డోసు తీసుకున్న వారిలో 80,000 కరోనా కేసులు నమోదు కాగా, రెండో డోసు తీసుకున్న వారిలో 40,000 మందికి వైరస్ సోకినట్టు అధికారులు చెప్పారు. వందశాతం వ్యాక్సిన్ రేటు నమోదు చేసిన కేరళ లోని వయనాడ్‌లో కూడా కరోనా కేసులు నమోదైనట్టు వివరించారు. ఈ నేపథ్యంలో కేరళతోపాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, రాష్ట్రాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Over 87000 fully vaccinated individuals test Corona
- Advertisement -