Tuesday, November 5, 2024

ప్రమాదపుటంచున కడెం ప్రాజెక్టు

- Advertisement -
- Advertisement -

 రెడ్ అలర్ట్ ప్రకటించిన కడెం ప్రాజెక్టు అధికారులు

హైదరాబాద్: గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పోటెత్తింది. వరద తీవ్రరూపం దాల్చడంతో ప్రాజెక్ట్ ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు తెలిపారు. దిగువ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  ఇన్ ఫ్లో ప్రమాద స్థాయిలో 5,09,025 క్యూసెక్కులు ఉండగా 18 గేట్లు ఎత్తడంతో 2,98,947 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.    కడెం ప్రాజెక్టు సామర్థ్యం 700 అడుగులు ఉండగా నీట మట్టం 700 అడుగులకు చేరింది.  7.603 టిఎంసిలకు గాను 7.603 టిఎంసిలకు చేరంది. ఇన్ ఫ్లో ఎక్కవగా ఉండి ఔట్ ఫ్లో తక్కువగా ఉండడంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.  కడెం, కన్నపూర్, దేవునిగూడెం, రాపర్, మున్యాల్, గొడిషిరియల్ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News