Monday, December 23, 2024

అధిక జనాభా అనర్ధదాయకం

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : అధిక జనాభా అనర్ధదాయకమని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీశ్‌రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్య శఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా ఆస్పత్రి నుంచి చేపట్టిన ర్యాలీని డిఎంహెచ్‌ఒ హరీశ్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. జనాభా పెరుగుదల వల్ల కలిగే అనర్ధాలు, సామాజిక అసమానతలు, ఆర్థిక సమస్యలు,పరిపాలన అంశాలు, ప్రకృతి పరిసరాల మౌళిక వసతుఉ, మానవ జీవన ప్రమాణాల గురించి అవగాహన కలిగిఉండాలన్నారు.

మనదేశ ప్రస్తుత జనాభా సుమారు 140 కోట్లుప్రపంచ జనాభాలో 17.85 శాతంతో ప్రస్తుతం మన దేశ జనాభా పెరుగుదల 0.99గా ఉన్నదన్నారు. దేశంలో ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో 464మందినివసిస్తున్నారని, జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, పెళ్లి జరిగిన వెంటనే పిల్లలు కనడం, కాన్పు కాన్పుకు మధ్య ఎడం లేకపోవడమన్నారు. అలాగే మగ సంతానం కోసం ఎదురుచూడడం వల్ల కూడా జనాభా పెరిగిందని పేర్కోన్నారు. జనాభా విస్పోటం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాద్యత వహించాలన్నారు. ఈ సందర్భంగా ఒక సంతానంతోనే ఆపరేషన్ చేయించుకున్న బొడ జ్యోతి మంగీలాల్,అలాగే తాత్కాలిక పద్దతులు వాడిన నాగభవాని,జి. ప్రీతిలను ఘనంగా సత్కరించి వారికి నగదు బహుమతులు అందించారు.

అంతేకాకుండా జిల్లాలో ఉత్తమ సేవలందించిన వైద్యులు, ఉద్యోగులు, నర్సులను మెమెంటోలు అందించి శాలువతో సత్కరించి వారికి సర్టిఫికెట్లను అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్‌ఒలు డాక్టర్ ఎ. అంబరీష, డాక్టర్ ఉమాగౌరి, పి.ఓ డాక్టర్ సుదీర్‌రెడ్డి, కె.వి. రాజు, డిప్యూటీ డెమో,, సిహచ్‌ఓ కృష్ణార్జునరావు, హెల్త్ ఎడ్యుకేటర్లు మహేందర్‌రెడ్డి, పురుషోత్తం, గీత, డిపిఎంఓ వెంకన్న, మంగమ్మ, రుక్కోద్దీన్, హెచ్‌ఈవో ఒబిలిశెట్టి రామకృష్ణ, వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News