Wednesday, January 22, 2025

ట్రిపుల్ రైడింగ్.. పదో తరగతి విద్యార్థి ప్రాణం తీసిన అతివేగం

- Advertisement -
- Advertisement -

సంతోష్ నగర్: హైదరాబాద్ లోని సంతోష్ నగర్ లో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. ముగ్గురు యువకులు డిఆర్ డిఎల్ వద్ద బైకుపై అతివేగంగా వెళ్లారు. ఆ సమయంలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టిన యువకులు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలతో పదో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఫైజన్(18)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News