Thursday, January 9, 2025

పాదయాత్రలు…డోర్ టు డోర్ ప్రచారంతో ఓవైసి బ్రదర్స్ బిజీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్‌ల పర్వం ముగియడంతో హైదరాబాద్ నగరంలో ఎంఐఎం ప్రచారం ఊపందుకుంది. 9 స్థానాల్లో పోటీ చేస్తున్న ఎఐంఎం అభ్యర్థులను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న ఓవైసీ బ్రదర్స్ పాదయాత్రలు, డోర్ టు డోర్ క్యాంపేనర్‌తో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. చార్మినార్ అసెంబ్లీ టికెట్ దక్కక పోవడంతో ఎదురు తిరిగిన సిట్టింగ్ ఎంఎల్‌ఎ ముంతాజ్ అహ్మద్ ఖాన్ శాంతించడంతో చార్మినార్‌లోనూ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.

ఎంఐఎం చార్మినార్ అభ్యర్థి మాజీ మేయర్ మీర్ జుల్ఫెఖర్ అలీ విజయానికి ముంతాజ్ అహ్మద్ ఖాన్ కూడా ప్రచారం చేపట్టారు. అత్యధిక మేజారిటీతో జుల్ఫెఖర్ అలీని గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇక పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి ఎంఐఎం పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లోనూ అభ్యర్థుల విజయానికి పాదయాత్రలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్, కార్నర్స్ మీటింగ్‌లు, బహిరంగ సభలతో బిజీగా ప్రచారం చేస్తున్నారు. అతని సోదరుడు చాంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసి కూడా తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఓటర్ దేవుళ్ళను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఎంఐఎం అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులకు ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. దీంతో గెలుపుపై పూర్తి ధీమాతో ఎంఐఎం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News