Friday, January 10, 2025

ఒవైసీ బ్రదర్స్ దూకుడు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. మరో ఎనిమిది రోజుల్లో పోలింగ్ ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే మజ్లిస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తమ అభ్యర్థుల విజయాన్ని భుజస్కందాలపై వేసుకున్న ఓవైసీ బ్రదర్స్ పాదయాత్రలు, ఇంటింటి ప్రచారం, కార్నర్స్ మీటింగ్స్, బహిరంగ సభలతో అలుపెరగని ప్రచా రం చేస్తున్నారు.

‘ఘర్ ఘర్ మజ్లిస్..హర్ ఘర్ మజ్లిస్’ నినాదంతో ఓవైసి బ్రదర్స్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లు కెసిఆర్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాభివృద్ధి కోసం చేపట్టిన పథకాలను ప్రచారాస్త్రంగా వినియోగిస్తున్నారు. మంగళవా రం అసదుద్దీన్ ఓవైసీ నాంపల్లి, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లలో ప్రచారంలో పాల్గొన్నారు. బిజెపి బుల్డోజర్ రాజకీయాలకు పాల్పడుతోందని, ఆర్‌ఎస్‌ఎస్ మూలాలు ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మోహన్ భగవత్ కనుసన్నల్లో పనిచేస్తున్నాడని అసదుద్దీన్ ఓవైసి కాంగ్రెస్ బిజెపిలపై విరుచుకుపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News