Thursday, January 23, 2025

దిగజారి మాట్లాడడం..మానసిక స్థితిని తెలియజేస్తుంది

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్‌పై బండిసంజయ్ చేసిన వాఖ్యలపై ఒవైసి

 

మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి పేరును మార్చి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి ఖండించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అతని దిగజారిన మానసిక పరిస్థితికి అద్దం పడుతుందని ఆయనన్నారు. బుధవారం ఒవైసి విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడి, అమిత్ షా, నడ్డా లకు మారు పేర్లతో మాట్లాడితే ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

తన పాదయాత్రకు జనం రాకపోవడానికి తాను కారకుడిని కాదని డబ్బులిచ్చినా జనం రావడం లేదని అందుకే పిచ్చిపిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. యూపి ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులపై సర్వే నిర్వహించాలని నిర్ణయించడంపై అసదుద్దీన్ స్పందించారు. మదరసాల సర్వే నిర్వహిస్తూ ఇపుడు వారి కన్ను వక్ఫ్ ఆస్తులపై పడిందని విమర్శించారు.

బాబరీ మసీదు, జ్ఞానవాపి మసీదుల స్థలాలు కూడా వక్ఫ్ ఆస్తులేనని ఒవైసి తెలిపారు. వక్ఫ్ ఆస్తుల గురించి తెలుసుకోవాలంటే సున్నీ, షియా వక్ఫ్‌బోర్డులను అడిగితే తెలుస్తుందని చెప్పారు. వక్ఫ్ ఆస్తులను ఆక్రమించడం అంత సులువేమి కాదని స్పష్టం చేశారు. యుపి ప్రభుత్వ నిర్ణయం దురుద్దేశపూరితమని వ్యాఖ్యానించారు.

హి.జాబ్ విషయంలో ఇరాని అమ్మాయిలపై ప్రేమ ఒలక బోస్తున్న కేంద్రం ప్రభుత్వం పెద్దలు భారత అమ్మాయిలంటే ఎందుకు అంత వ్యతిరేకత అని ప్రశ్నించారు. కర్నాటకలో పాఠ్యపుస్తకాల్లో మత బోధన చేసే ప్రయత్నాలను ఆయన తప్పుపట్టారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 28 ఉల్లంఘించడమేనన్నారు. భారత భూభాగాన్ని చైనా అక్రమించుకుంటే ప్రధాని మోడి నోరు విప్పరని ఎద్దేవా చేశారు. చైనా భఫర్ జోన్ క్రియేట్ చేసినట్లు అక్కడి కార్పొరేటర్ వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News