Sunday, December 22, 2024

రాహుల్ పోటీ చేస్తే ఎంఐఎం సత్తా ఏంటో చూపిస్తాం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహల్ గాంధీ హైదరాబాద్ లో పోటీ చేయాలని అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. రాహుల్ పోటీ చేస్తే ఎంఐఎం సత్తా ఏంటో చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కెసిఆర్ కు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉందన్న ఒవైసీ కాంగ్రెస్ పతనానికి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు.

శుక్రవారం నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బిఆర్ఎస్ బాస్ కెసిఆర్ జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ విషయానికోస్తే ఢిల్లీ, కర్నాటక నుంచి నేతలు వచ్చి తమ ఆరు గ్యారంటీలతో తెలంగాణ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన కొనసాగించారు. ఈ క్రమంలోనే అధికార బిఆర్ఎస్ పార్టీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News